నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ మూవీ రివ్యూ గురించి ఇప్పుడు చూద్దాం.
ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే : పోలీసులు, ఓ కరుడు గట్టిన క్రిమినల్ మధ్య జరుగుతున్న సన్నివేశాలతో ప్రారంభమైన ఈ మూవీ ఆ వెంటనే రాయలసీమ ప్రాంతానికి షిఫ్ట్ అవుతుంది. మురళి కృష్ణ (బాలయ్య) ఓ ఊరికి పెద్దగా ఉంటాడు ఆ గ్రామంలో అన్యాయాన్ని అడ్డుకుంటూ పేదలకు అండగా ఉంటాడు.అదే జిల్లాలో కలెక్టర్ గా పని చేస్తున్న శరణ్య (ప్రగ్యా జైస్వాల్) అణగారిన వర్గాలకు అండగా నిలుస్తూ తప్పు చేసే వారిపై చర్యలు తీసుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలో శరణ్య,మురళి కృష్ణ మధ్య పరిచయం ఏర్పడుతుంది అది ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకొని వైవాహిక జీవితం మొదలుపెడతారు.ఇక అదే ఊరిలో వరద రాజులు(శ్రీకాంత్) అక్రమంగా మైనింగ్ జరుపుతూ ఉంటాడు. ఇది తెలుసుకున్న మురళి కృష్ణ… వరదరాజులును అడ్డుకుని అతడిని ఎదిరిస్తాడు. మురళి కృష్ణను ఎలాగైనా పక్కకు తప్పించాలని ప్లాన్ వేసిన వరదరాజులు ఆయనను ఓ తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపిస్తాడు. ఇక అతని అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతాయి.మురళి కృష్ణ కుటుంబానికి వరదరాజులు ఓ పెద్ద ప్రమాదంలా మారుతాడు.ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా, ఎమోషనల్ గా సాగిపోయే ఈ మూవీ సెకండాఫ్ పై భారీ ఉత్కంఠను రేపుతుంది.
ఇక సెకండ్ హాఫ్ లో అఖండగా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పిస్తూ చిత్రాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తాడు. అసలు ఈ అఖండ ఎవరు? మురళి కృష్ణకు అతనికి సంబంధం ఏమిటి? అఖండ.. వరద రాజులకు ఎలా చెక్ పెట్టాడనేది తెలియాలంటే ఈ మూవీ చూడాలి.
ఇక మూవీ విశ్లేషణ విషయానికి వస్తే :
బాలయ్య నటన, డ్యాన్స్, డైలాగ్స్,లుక్స్ సినీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.విలన్ గా శ్రీకాంత్ తన పాత్రకు న్యాయం చేశారు.తమన్ నేపథ్య సంగీతం ఈ మూవీకి పెద్ద ఏసెట్ గా మారింది.
ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే :
+ బాలయ్య అఘోర పాత్ర
+ విలన్ కు హీరోకు మధ్య వచ్చే సీన్స్
+ యాక్షన్ ఎపిసోడ్స్
+ డైలాగ్స్
+ తమన్ నేపథ్య సంగీతం
ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే :
_ఫస్ట్ ఆఫ్ ల్యాగ్
– కొన్ని రొటీన్ సన్నివేశాలు
అఖండతో ఈ మూవీ కాంబో మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ ను అందుకుంది.