అఖండ మూవీలోని జై బాలయ్య సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.ఈ సాంగ్ లో బాలయ్య,ప్రగ్య జైస్వాల్ వేసిన స్టెప్స్ ఈ సాంగ్ సూపర్ హిట్ అవ్వడంలో కీలకమైంది.ఈ పాటను కంపోజ్ చేసిన భాను మాస్టర్ కు మెగాస్టార్ తాజాగా ఓ ఆఫర్ ఇచ్చారు.మలయాళంలో సూపర్ హిట్ అయిన లుసిఫర్ మూవీని తెలుగులో మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్నారు.ఈ మూవీలో ఒక సాంగ్ కంపోజ్ చేయమని మెగాస్టార్ స్వయంగా భాను మాస్టర్ ను కోరారట.
మెగాస్టార్ నుండి ఆఫర్ రావడంతో ప్రస్తుతం భాను మాస్టర్ ఆనందానికి అవధులు లేవట.మెగాస్టార్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే భాను మాస్టర్ భావిస్తున్నారట అందుకే ఆయన మెచ్చే విధంగా ఉండాలని సాంగ్ ను కంపోజ్ చేస్తారట.