బోయపాటి శీను దర్శకత్వంలో ముచ్చటగా మూడవసారి బాలయ్య చేసిన మూవీ అఖండ.ఈ మూవీలో ద్విపాత్రాభినయంలో కనిపించిన బాలయ్య సరసన ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.ఈ మూవీలో హీరోయిన్ పూర్ణ కీలక పాత్రలో కనిపించగా,శ్రీకాంత్ విలన్ గా కనిపించి మెప్పించారు.రిలీజ్ అయ్యి చాలారోజుల అవుతున్న ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతూ కొత్త సినిమాలకు గట్టి పోటీ ఇస్తుంది.దీంతో నిర్మాత ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్న హాట్ స్టార్ ను ఓటిటిలో అప్పుడే మూవీని విడుదల చేయవద్దని కోరారు.కానీ దానికి హాట్ స్టార్ అంగీకరించలేదు.
హాట్ స్టార్ ఈ మూవీని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని ప్లాన్ చేస్తుంది.అందుకే నిర్మాతల ప్రోపజల్ ను రిజెక్ట్ చేసింది.ఈ మూవీకి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్ మెంట్ మరి కొద్ది రోజులలో హాట్ స్టార్ విడుదల చేయనుంది.