బిగ్ బాస్ హౌస్ లోకి గౌతమ్ కృష్ణ వెళ్ళనున్నాడా అంటే.. అవును వెళ్తున్నారు . అతనే హింట్ ఇచ్చాడు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అతను వెళ్తాడా లేదా అనే డౌట్ చాలా మందికి ఉండేది.. కానీ నేటితో అది పక్కా ఫిక్స్ అయింది. తాజాగా గౌతమ్ కృష్ణ తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చనింగ్ స్టార్ట్ చేశాడు. అందులో ఒకరు ‘ సెప్టెంబర్ 3rd వస్తున్నారా’ అని అడుగగా.. గుండెల్లోకి డైరెక్ట్ ఎటాక్ అని గౌతమ్ కృష్ణ రిప్లై ఇచ్చాడు.
యంగ్ హీరో గౌతమ్ కృష్ణ ఒకవైపు హీరోగా, మరొకవైపు దర్శకత్వం వహించిన సినిమా ‘ఆకాశ వీధుల్లో’. ఈ మూవీ గౌతమ్ కృష్ణకి తొలి సినిమా అయిన ఇప్పటికే చాలా మూవీ చేసినంత అనుభవంతో అతను నటించాడు. పూజిత పొన్నాడ, గౌతమ్ కృష్ణ, సత్యం రాజేశ్, దేవి ప్రసాద్ ఫ్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు. ఆకాశ వీధుల్లో సినిమా కథేంటంటే.. సిద్ధు (గౌతమ్ కృష్ణ) పెద్ద రాక్ స్టార్ కావాలని చదువును నిర్లక్ష్యం చేసి తన తండ్రి దేవీ ప్రసాద్ తో గొడవపడి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత నిషా(పూజితా పొన్నాడ)తో ప్రేమలో పడి కొన్నాళ్ళ తర్వాత నిషాతో మనం లివింగ్ లో ఉందామని చెప్పగా.. నిషా తనకు ప్రేమపై నమ్మకం లేదని చెప్పి, అతనికి దూరంగా ఉంటుంది. దాంతో ప్రేమ విఫలం అయ్యి మద్యపానం, మాదకద్రవ్యాలకు సిద్దు బానిస అవ్వడంతో అతని జీవితం తలకిందులవుతుంది, అతను ఈ సమస్యలన్నింటిని ఎలా ఎదురుకున్నాడు అనేదే మిగతా సినిమా కథ.

మొదటి సినిమా ‘ఆకాశ వీధుల్లో’ సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్టు తనే ఇన్ స్టాగ్రామ్ లో హింట్ ఇచ్చాడు. ఆస్క్ మి క్వశ్చనింగ్ లో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధనమిచ్చాడు గౌతమ్ కృష్ణ. మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటని ఒకరు అడుగగా.. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 3, అని రిప్లై ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. అన్న మీరు బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్స్ లోకి వచ్చారా అని ఒకరు అడుగగా తాను …. అవునని రిప్లై ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. నెక్స్ట్ మూవీ ఏంటని అనగా.. త్వరలోనే చెప్తామని అన్నాడు. ‘ టీవీలో చూడొచ్చా మిమ్మల్ని లైక్ షోస్’ అని ఒకరు అడుగగా.. ” చూడొచ్చు, చూడాలనుకుంటే చూడొచ్చు” అని గౌతమ్ కృష్ణ రిప్లై ఇచ్చాడు. సెప్టెంబర్ 3rd వస్తున్నారా అంటే డైరెక్ట్ గుండెల్లోకి అని చెప్పిన గౌతమ్ కృష్ణ పక్కాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాడా? మరి ఇది నిజమేనా కాదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.