తాజాగా తమిళ్ హీరో అజిత్ ఇంటి వద్ద ఆయన అభిమాని కారణంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివరాలలోకి వెళ్తే చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తున్న ఫర్జానా గతేడాది అజిత్, తన భార్య షాలినితో కలిసి వాళ్ళ హాస్పటల్‌కు వచ్చినప్పుడు ఆయనతో ఫోటో దిగి దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.ఈ ఫోటోలు అజిత్ కు కరోనా సోకినప్పుడు వైరల్ అయ్యాయి.దీంతో హాస్పిటల్ యాజమాన్యం ఫర్జానాను ఉద్యగం నుండి తొలగించారు.
ఈ విషయంపై అజిత్ ను కలిసి తన ఉద్యోగం గురించి మాట్లాడటానికి ఫర్జానా చాలా ప్రయత్నించింది.కానీ అది వీలు పడలేదు.దీంతో తనకి న్యాయం జరగట్లేదని ఆవేదన చెందిన ఫర్జానా నా చావుకు అజితే కారణం అంటూ కేకలు వేస్తూ ఆయన ఇంటి ముందు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అక్కడికి సమయానికి చేరుకున్న పోలీసులు ఆమె ప్రయత్నాన్ని వెంటనే అడ్డుకున్నారు.