పాన్ ఇండియా సినిమాల హవా మొదలైన తర్వాత హీరోలు, దర్శకులతో పాటు మిగిలిన టెక్నీషియన్స్ ఇమేజ్ కూడా పెరుగుతుంది. పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా ప్రేక్షకులకి చేరువ కావడంలో మ్యూజిక్ పాత్ర ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ సిరీస్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, పొన్నియన్ సెల్వన్ లాంటి సినిమాల సక్సెస్ లో మ్యూజిక్ కూడా చాలా కీలక పాత్ర పోషించింది. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా యూనివర్శల్ ఆడియన్స్ కి రీచ్ అయ్యే విధంగా బ్యాగ్రౌండ్ సౌండ్స్ తో కానీ, సాంగ్స్ తో కానీ అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి అలాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు తెరకి పరిచయం అవుతున్నాడు.
సుదీప్ విక్రాంత్ రోణ, తాజాగా వచ్చి సూపర్ హిట్ అయినా కాంతారా సినిమాలకి సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన అజనీష్ లోకనాథ్ తెలుగులో డెబ్యూ మూవీగా సాయి ధరమ్ తేజ్ తో చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నాడు. సుకుమార్ ఈ మూవీకి కథ అందించారు. ఈ సినిమా మ్యూజిక్ కోసం అజనీష్ లోకనాథ్ ని కన్ఫర్మ్ చేశారు.
ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో సాయి తేజ్ కి జోడీగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా ఖరారైంది. సాయి తేజ్ కెరియర్ లోనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ మూవీలో చాలా ఉంటాయని టాక్. అందుకోసమే మ్యూజిక్ కాస్తా ఫ్రెష్, సరికొత్తగా ఉండాలని అజనీష్ లోకనాథ్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్.