Aishwarya Lakshmi : మలయాళం, తమిళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న నటి ఐశ్వర్య లక్ష్మి. రీసెంట్ గా ఈ భామ నటించిన వెబ్ సిరీస్ కు మంచి క్రేజ్ లభించింది. తన నాచురల్ నటనతో అభిమానులను ఆకట్టుకుంది. నటన పరంగానే కాదు ఆమె సార్టోరియల్ ఫ్యాషన్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి.

ఈ బ్యూటీ సంపూర్ణ ఫ్యాషన్‌వాది. తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో రోజూ తన అభిమానుల కోసం ఫ్యాషన్ లక్ష్యాలను వదులుతూనే ఉంటుంది . అది ఆరు గజాల చీర అయినా లేదా రంగురంగుల సాసీ కో-ఆర్డ్ సెట్ అయినా, ఐశ్వర్యకు సరిగ్గా నప్పుతాయి. ఈమె లుక్స్ చూసి ఫ్యాషన్ ప్రియులు నోట్స్ రాసుకోవడానికి తహతహలాడు తుంటారు. మరి ఈ నటి ఫాలో అయ్యే కొన్ని ఫేవరెట్ లుక్స్ మీకోసం.

Aishwarya Lakshmi : సౌత్ అమ్మాయిలకు శారీ అంటే ఎంతో సెంటిమెంట్ . పండుగలైనా, పెళ్ళైన, ఫంక్షన్ ఏదయినా చిరకట్టుతోనే చంపేస్తుంటారు. ఐశ్వర్య కూడా పసుపు , నీలం రంగు కాంజీవరం చీరను ట్రెడిషనల్ గా కట్టుకొని అదరగొట్టింది. ఈ చీరకు సెట్ అయ్యేలా ఆభరణాలను పెట్టుకుని , అందమైన కొప్పు వేసుకుని తెల్లటి పువ్వులు పెట్టుకుని కుర్రాళ్ళను కవ్వించింది.

ట్రెడిషనల్ లుక్ లోనే కాదు వెస్ట్రన్ అవుట్ ఫిట్స్ లోనూ ఈ భామ ఎంతో హాట్ గా కనిపించి ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేసింది. తాజాగా ఈ బ్యూటీ నటించిన మట్టి కుస్తీ సినిమా ప్రమోషన్ కోసం ముదురు నీలం రంగు శాటిన్ పొట్టి దుస్తులలో కనిపించి అదరగొట్టింది. ఈ షార్ట్ డ్రెస్ పైన నీలిరంగు శాటిన్ ష్రగ్ వేసుకుంది. ఈ పిక్స్ ను తన ఇన్ స్టార్ లో పోస్ట్ చేసి హల చల్ చేసింది.

ఐశ్వర్య వింటర్ సీజన్ లో తెల్లటి డ్రెస్ తో మెస్మరైజ్ చేసింది. ఇటీవల చేసిన ఓ ఫోటో షూట్ కోసం ఈ బ్యూటీ తెల్లటి బ్లేజర్‌తో ఉబ్బిన ఫుల్ స్లీవ్‌లతో బంగారు వివరాలను కలిగిన తెల్లటి చీరలో ఐశ్వర్య తళుక్కుమంది.

ఐశ్వర్య చీర డైరీలు ఆమె అభిమానులకు అమితంగా నచ్చుతాయి. సిల్వర్ రేషమ్ థ్రెడ్ వివరాలతో వచ్చిన ఈ పాస్టెల్ ఆకుపచ్చ చీరకు జోడిగా ఆకుపచ్చ బ్లౌజ్ వేసుకుని మెరిసింది. ఈ లుక్ లో అమ్మడు ఎంతో క్యూట్ గా కనిపించి అలరించింది.
