నార్త్ ఇండియా నుంచి చాలా మంది అందాల భామలు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి సినిమాతోనే మెప్పిస్తూ తరువాత స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నారు. అలాగే వచ్చిన కాజల్ అగర్వాల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి, ఇప్పుడు కియారా అద్వానీ లాంటి భామలు అందరూ కూడా స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్నవారే. తెలుగులో వీరి తెరంగేట్రంలో చాలా క్యాజువల్ రోల్స్ లో కనిపించిన తరువాత మాత్రం తమలోని అందాన్ని బయటపెట్టి అందరిని ఆకట్టుకున్నారు. నార్త్ ఇండియా భామలు హాట్ స్కిన్ షోకి ఏ మాత్రం వెనుకాడరు.
సినిమాలో పాత్ర కోసం ఎలా నటించడానికి అయినా రెడీగా ఉంటారు. అవసరం అయితే ఇంటిమేట్ సన్నివేశాలలో కూడా నటించడానికి నార్త్ ఇండియన్ హీరోయిన్స్ సిద్ధంగా ఉంటారు. ఇక తేజ దర్శకత్వంలో లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కాజల్ అగర్వాల్ ఎంత పెద్ద స్టార్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక చాలా గ్యాప్ తర్వాత గీతిక అనే బ్యూటీని అహింస సినిమాతో టాలీవుడ్ కి తేజ పరిచయం చేస్తున్నాడు.
దగ్గుబాటి అభిరామ్ కి జోడీగా ఈ భామ నటిస్తుంది. ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఈ బ్యూటీ బాగానే నటిస్తుంది. టీజర్ లో ఆమె నటనతో మెప్పించింది. దీనికంటే ముందుగా తమిళ్ లో శరవణన్ హీరోగా తెరకెక్కిన ది లెజెండ్ సినిమాతో ఈ బ్యూటీ హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. మోడలింగ్ నుంచి నటిగా సినిమాలోకి రావడంతో స్వతహాగాగానే ఈ బ్యూటీ స్కిన్ షోకి ఏ మాత్రం వెనుకాడదు అని చెప్పొచ్చు. ఇక తేజ అహింస సినిమా రిలీజ్ కాకుండానే గీతిక తన హాట్ అందాలని ఫోటోషూట్ లతో చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఇప్పుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.