ఒకవైపు చైనా,మరోవైపు పాకిస్తాన్ కవ్విస్తున్న నేపథ్యంలో భారత్ రక్షణ రంగంలో వరసగా విజయాలు సాధిస్తూ ప్రపంచానికి తన సత్తా చాటుతుంది.తాజాగా ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో బుధవారం రాత్రి 7.30 గంటలకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ వారు అగ్ని5 మిసైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.
దీంతో భారత్ అమ్ముల పొదలో 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించ గల సామర్ధ్యం ఉన్న మిసైల్ చేరింది.2012 లో అగ్ని 1ను పరీక్షించి విజయం సాధించిన భారత్ తొమ్మిదేళ్ళ కాలంలో అగ్ని సిరీస్ లలో ఐదు మిసైళ్లను ప్రయోగించి విజయాలను సాధించింది.
అగ్ని మిసైల్ ను భారత్ చైనాకు చెక్ పెట్టేందుకు రూపొందించింది.సరిహద్దులలో చైనా ఓవర్ యాక్షన్ చేస్తున్న నేపథ్యంలో భారత్ అగ్ని 5 మిసైల్ ను ప్రయోగించి విజయం సాధించడంతో టెన్షన్ పడడం చైనా వంతు అవుతుంది.