అక్కినేని నాగార్జున నట వారసుడు అఖిల్ అక్కినేని చాలా కసిగా హిట్ కొట్టడానికి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటి వరకు అఖిల్ హీరోగా చేసిన నాలుగు సినిమాలు ప్రేక్షకులని ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. అయితే ఈ సారి ఎలా అయినా బ్లాక్ బస్టర్ కొట్టి పాన్ ఇండియా లెవల్ లో తన ఇమేజ్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అఖిల్ అనుకుంటున్నాడు. దానికి తగ్గట్లుగా హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశం ఎంచుకున్నాడు. ఏజెంట్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో రా ఏజెంట్ గా అఖిల్ కనిపించబోతున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా కొత్తగా హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీలో ఉండబోతున్నాయి అని ఇప్పటికే వచ్చిన టీజర్ బట్టి తెలుస్తుంది.
ఇక ఈ మూవీని ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు షూటింగ్ కి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు కంప్లీట్ కావడంతో సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న వారసుడు, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల ప్రమోషన్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఆ సినిమాలకి సంబందించిన ఫస్ట్ సాంగ్స్ ని రిలీజ్ చేశారు. ఇక డిసెంబర్ నుంచి కంప్లీట్ గా ఆయా సినిమాల ప్రమోషన్స్ జరగబోతున్నాయి.
అయితే ఏజెంట్ మూవీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. దీనిని బట్టి ఈ మూవీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. దానికి తగ్గట్లుగానే దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మూవీని మార్చి నెల ఆఖరులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. త్వరలో ఈ రిలీజ్ డేట్ చేంజ్ గురించి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న సినిమా కాబట్టి మార్కెట్ లో ఆ సమయంలో ఏజెంట్ కి ఎలాంటి పోటీ లేకుండా చూసుకొని డేట్ ఫిక్స్ చేసే పనిలో సురేందర్ రెడ్డి ఉన్నట్లు బోగట్టా.