వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో మొన్నటి వరకు వాల్తేర్ వీరయ్య, వారసుడు, ఆదిపురుష్, ఏజెంట్ సినిమాలు బరిలో నిలిచాయి. ఇవన్నీ భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఎవరు వీరిలో నిలబడతారు అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే అనూహ్యంగా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా సంక్రాంతి రిలీజ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయింది. జూన్ 16న ఈ మూవీ రిలీజ్ ఉంటుందని దర్శకుడు ఓం రౌత్ క్లారిటీ ఇచ్చాడు. ప్రేక్షకులకి మరింత నచ్చే విధంగా తీర్చిదిద్దడం కోసం కొన్ని మార్పులు చేస్తున్నామని దీనికోసం రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉంటే అక్కినేని నట వారసుడు అఖిల్ కెరియర్ లో అత్యధిక బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో చేస్తున్న సినిమా ఏజెంట్.
సురేందర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కెరియర్ లో ఇప్పటి వరకు సక్సెస్ లేకుండా ట్రావెల్ చేస్తున్న అక్కినేని హీరో ఏజెంట్ తో ఎలా అయినా సాలిడ్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో సంక్రాంతి బరిలో నిలవాలని ముందు అనుకున్నాడు. అయితే పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ మూవీని వాయిదా వేయడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి రెడీ అయినట్లు తెలుస్తుంది. అఫీషియల్ ఐగా ఇంకా కన్ఫర్మ్ చేయకపోయిన వాయిదా పడటం మాత్రం పక్కా అనే మాట వినిపిస్తుంది.
ఈ రెండు సినిమాలు పోటీ నుంచి తప్పుకుంటే ఇక బరిలో నిలబడేవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి, విజయ్ వారసుడు సినిమాలు మాత్రమే. వీరిలో ఒక్కరైనా వెనక్కి వెళ్లే అవకాశం ఉందా లేదా అనేది త్వరలో తెలిసిపోయే అవకాశం ఉంది. వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించడంతో ఒకే సారి రెండు సినిమాలు రిలీజ్ చేసే సాహసం చేయకపోవచ్చనే మాట వినిపిస్తుంది. ఫ్యాన్స్ హర్ట్ అవ్వకుండా ఏవో స్ట్రాంగ్ రీజన్స్ చూపించి సినిమా వాయిదా వేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.