ప్రస్తుతం టాలీవుడ్ మంచి సక్సెస్ రేట్ తో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ ఉన్న యంగ్ హీరో అంటే వెంటనే అడవి శేష్ పేరు వినిపిస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అడవిశేష్ కెరియర్ ఆరంభంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అయితే తరువాత క్షణం సినిమాతో తన కెరియర్ డ్రైవ్ ని పూర్తిగా మార్చుకున్నాడు. డిఫరెంట్ కథలతో వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ మీద సక్సెస్ కొడుతున్నారు. చివరిగా మేజర్ సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాడు. మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా ఆ మూవీ తెరకెక్కింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అడవి శేష్ హీరోగా నాని నిర్మించిన హిట్ 2 మూవీ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతుంది.
సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ తెరకెక్కింది. శైలేంద్ర కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అడవి శేష్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇక ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత అడవి శేష్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నాగార్జున నిర్మించబోతున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో తెరకెక్కుతుందని తెలుస్తుంది.
ఇప్పటికే మేజర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా శేష్ మారిపోయాడు. ఇప్పుడు హిట్ 2 మూవీ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే రిలీజ్ అవుతుంది. శేష్ కి ఉన్న ఇమేజ్ ఈ మూవీకి మార్కెట్ పరంగా కలిసి వస్తుందని నిర్మాత నాని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఏకంగా అన్నపూర్ణ స్టూడియో లాంటి పెద్ద బ్యానర్ లో పాన్ ఇండియా సినిమా చేయడానికి శేష్ రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో కింగ్ నాగార్జున కూడా కనిపిస్తాడని తెలుస్తుంది. యాక్షన్ అండ్ లవ్ జోనర్ లో ఈ మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది.