సౌత్ ఇండియాలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి అదితీరావ్ హైదరీ. ముందుగా ఈ బ్యూటీ హిందీలో హీరోయిన్ గా తెరంగేట్రం చేసి తరువాత తెలుగులోకి అడుగుపెట్టింది. మణిరత్నం దర్శకత్వంలో చెలియా అనే సినిమాలో కూడా చేసింది. ఇక తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తుంది. అలాగే హిందీలో కూడా ఆఫర్స్ ని సొంతం చేసుకుంటుంది. పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసి తరువాత హీరోయిన్ గా అదితీరావ్ నటిగా తెరంగేట్రం చేసింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ కెరియర్ ఆరంభంలో ఎదురైన కొన్ని బాధాకరమైన అనుభవాలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.
తాను హీరోయిన్ గా తెరంగేట్రం చేసినపుడు ఓ సీన్ లో బ్యాక్ లెస్ జాకెట్ తో కాస్తా హాట్ గా నటించాల్సి వచ్చింది. అయితే కొద్ది రోజులకి ఎవరో ఆ ఫోటోని మార్ఫింగ్ చేసి కంప్లీట్ న్యూడ్ గా తయారు చేశారు. మొదటిసారి అలా నన్ను నేను న్యూడ్ గా ఫోటోలో చూసుకునేసరికి కన్నీళ్లు ఆగలేదు. చాలా బాధకలిగింది. అయితే అయితే సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తర్వాత ఇలాంటి మార్ఫింగ్ ల ప్రభావం నాకు మాత్రమే కాకుండా చాలా మంది హీరోయిన్స్ పైన ఉంది.
ఏవో ఫోటోలని తీసుకొని వాటికి సంబంధం లేకుండా తమ ముఖాలు అతికించేసి సర్క్యులేట్ చేస్తారు. ఇలాంటి వాటి కారణంగా మానసిక వేదనకి గురవ్వాల్సి వస్తుంది అని అదితీరావ్ హైదరీ పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ చివరిగా హే సినామిక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ప్రస్తుతం తమిళంలో గంధీ టాక్స్ అనే సినిమా చేస్తుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ లో ఆమె నటించిన జూబ్లీ అనే వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీగా ఉంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో హీరమండి అనే వెబ్ సిరీస్ షూటింగ్ దశలో ఉంది. అలాగే తెలుగులో కూడా ఓ సినిమా చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తుంది.