Bigg boss 6 : ఏ ముమూర్తాన అక్క అక్క అంటూ గీతూకి దగ్గరయ్యాడో కానీ ఆదిరెడ్డి.. గేమ్‌లో ఆమె అతని నాశనానికి కారకురాలవుతోంది. నమ్మించి మోసం చేస్తోందని బయట పెద్ద టాక్. ‘ఏమైంది నువ్ వెనుకపడిపోతున్నావ్’ అంటూ సైకలాజికల్‌గా అతన్ని వెనక్కి లాగే ప్రయత్నం చేస్తోంది. ఒక రివ్యూవర్‌గా ఎంతో మందిని అర్ధం చేసుకున్న ఆదిరెడ్డి.. గీతూని మాత్రం అర్ధం చేసుకోలేకపోతున్నాడు. డైరెక్ట్‌గా నువ్వు గేమ్ ఆడట్లేదు అని చెబితే ఎక్కడ రివర్స్ అయిపోతాడో అని చాలా డేంజర్ గేమ్ ఆడుతోంది గీతూ.. నువ్వు వెనుకబడిపోతున్నావ్ అని చెబుతూ తానేదో గొప్ప ప్లేయర్ అన్నట్టుగా కలరింగ్ ఇస్తోంది.
ఆదిరెడ్డి పక్కన కూర్చుని మంచిగా మాటలు చెబుతూ తడిగుడ్డతో అతని గొంతు కోసేస్తోంది. తాజాగా మొన్నటికి మొన్న కెప్టెన్సీ టాస్క్ జరిగింది గుర్తుండే ఉంటుంది కదా. దానిలో ఆదిరెడ్డికి కూలీనెం.1లో వెంకటేష్ పాత్ర ఇచ్చారు. అతనేమైనా నటుడా.. పెర్ఫార్మెన్స్ ఇరగదీయడానికి? అయినా కూడా ఏదో పెట్టె భుజాన వేసుకుని తన పాట్లేవో తను పడుతున్నాడు. ఎప్పుడో వచ్చిన సినిమా కాబట్టి దాని గురించి మరిచిపోయి ఉండొచ్చు కూడా. శ్రీవల్లి క్యారెక్టర్ చేసిన గీతూ.. తానేదో ఇరగదీసినట్టు తెగ ఓవర్ యాక్షన్ చేసింది.
ఇక ఆదిరెడ్డి మొహంపై కాళ్లు పెట్టి ఊపుతూ చేసిన ఓవర్ యాక్షన్‌కు నెటిజన్లను తిట్టి తలంటు పోశారు. ఇక ఈ ఎపిసోడ్‌లో ఆదిరెడ్డికి పెద్ద గొయ్యే తవ్వింది. గీతూ, ఆదిరెడ్డిలు ఎప్పటిలాగే స్విమ్మింగ్ పూల్ దగ్గర పడుకుని ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలోనే ఆదిరెడ్డి ఈ సీజన్‌లో అంతా తుప్పాస్ కంటెస్టెంట్సే వచ్చారంటే.. ఇక ఆదిరెడ్డిపై ఓ రేంజ్‌లో విషయం కక్కేసింది. ఎంతలా అంటే తానంత వీక్ కంటెస్టెంటా అని ఆదిరెడ్డికే అనిపించేలా చేసింది. నువ్వు సరిగి పెర్ఫామ్ చేయట్లేదని తేల్చేసింది. ఆది కూడా బాగా ఫీలై పోయి ఆమె తనను డిజప్పాయింట్ చేస్తోందని చెప్పేశాడు. ఇక మరో అడుగు ముందుకు వేసి మరీ ఈసారి ఎలిమినేట్ అయ్యే వాళ్ల లిస్ట్‌లో నువ్వూ ఉండొచ్చని చెప్పేసింది. నిజానికి ఆదిరెడ్డిని అనాలి. అతని భార్య చాలా ఇంటెలిజెంట్‌గా గీతూని వదిలెయ్ అన్నట్టుగా చెప్పింది. అది కూడా అర్ధం చేసుకోలేదు మనోడు. ఆమెతో తిరుగుతూ తన గొయ్యే తనే తవ్వుకుంటున్నాడు.