Biggboss 6 : బిగ్ బాస్ సీజన్ 6 రెండో వారం కెప్టెన్సీ టాస్క్ ఎమోషనల్గా సాగుతోంది. సింసిద్రీ టాస్క్ అనంతరం జీవితంలో ఎదుర్కొన్న కష్టాన్ని కంటెస్టెంట్స్ వివరిస్తున్నారు. 11వ రోజు నాటి 12వ ఎపిసోడ్లో వాళ్లు ఏడుస్తూ ప్రేక్షకుల్ని ఏడిపించేశారు. గత రెండురోజులుగా బేబీ బొమ్మలతో ఎమోషనల్ బాండింగ్ ఏర్పరుచుకున్న కంటెస్టెంట్స్.. వారి రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్తో పాటు.. మీ జీవితంలో ఒక బేబీ ఉండటం ద్వారా మీ జీవితానికి ఎటు వంటి అర్దాన్ని తీసుకుని వస్తుందన్న దానిపై తమ భావాలను ప్రేక్షకులతోను.. తోటి ఇంటి సభ్యులతోనూ పంచుకోవాలని బిగ్బాస్ చెప్పారు.
మొదటిగా ఆదిరెడ్డి ఈ ఎమోషనల్ జర్నీని స్టార్ట్ చేశాడు. తన కూతురు పేరు అద్విత అని.. అయితే తనకి పిల్లలంటే ఇష్టం ఉండదని చెప్పాడు. ఇప్పటికీ తన వైఫ్ డెలివరీ రోజు పక్కన లేనని బాధపడుతూనే ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన చెల్లెలు బ్లైండ్ కావడంతో.. తన కూతురు కూడా అలాగే పుట్టిందని చాలామంది బంధువులు అన్నారని.. ఆ రోజున చాలా బాధపడ్డానని ఆదిరెడ్డి తెలిపాడు. అంతా బాగా జరిగితే.. ఇదే హౌస్లో తన పాప కూడా నడుస్తుందని చెప్పాడు ఆదిరెడ్డి. ఆ తరువాత సుదీప.. ‘దేవుడు దీనికి అన్నీ ఇచ్చేస్తున్నానని.. పొగరు ఎక్కువైపోతుందని అనుకున్నాడో ఏమో కానీ.. 2015లో నేను కన్సివ్ అయ్యాను. అప్పటికి నేను రెడీగా లేను. వద్దు అనుకున్నాను.. అందరూ ఒత్తిడి చేసే సరికి.. వచ్చినదాన్ని ఎందుకు వదులుకోవాలి అనుకున్నాను. కానీ నా గర్భంలో ఉన్న బిడ్డతో నేను మాట్లాడటం స్టార్ట్ చేశా..
Biggboss 6 : ఫ్యూచర్లో తల్లి అవుతుందని అనుకుంటున్నా..
హాస్పటల్కి వెళ్లాను.. బేబీకి హార్ట్ బీట్ వచ్చింది. అంతా బాగానే ఉందనుకున్న టైంలో నాకు థైరాయిడ్ హై అయిపోయింది. దాన్ని నేను చూసుకోలేక.. నా బిడ్డను నేను కోల్పోయాను. నా చెల్లి కూతురు వచ్చేవరకూ కూడా నాది అని అనుకోలేకపోయాను. దాని వల్లే మా రెండు ఫ్యామిలీలు దగ్గరయ్యాయి. మా ఆయన అంటుంటాడు.. అది వాళ్ల పిల్ల ఎప్పుడైనా ఇచ్చేయాలి అని.. చిన్న బొమ్మనే ఇవ్వాలంటే మనసు ఒప్పదు మనకి. వాళ్ల కూతుర్ని వాళ్లకి ఇవ్వడానికి నాకు ప్రాణం పోయినట్టు అనిపించింది. అందరి పిల్లలు.. నా దగ్గరకు వస్తారు.. నా పిల్లలే నా చేతికి రావడం లేదు.. అది ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు.. ఫ్యూచర్లో సుదీప తల్లి అవుతుందని అనుకుంటున్నాను అంటూ ఎమోషనల్ అయ్యింది సుదీప. ముందుగా వద్దు అనుకున్న తర్వాత తన కడుపులోని బేబిని చాలా ప్రేమించింది.. అదేనేమో అమ్మతనం అంటే..