ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆదిపురుష్ మేనియా కనిపిస్తోంది. దేశమంతటా జై శ్రీరామ్ మోత మోగుతోంది. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కోసం అన్ని భాషల ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటోంది ఆదిపురుష్.
ఆదిపురుష్ మూవీ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. అభిమానుల ఎదురు చూపులు జూన్ 16తో ముగియనున్నాయి. ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ అయితే ఊహించినట్లే భారీగా ఉంది. రూ.500 కోట్లతో తెరకెక్కిన సినిమా కావడంతో అదే స్థాయిలో థియేట్రికల్ హక్కులను ప్రొడ్యూసర్లు అమ్ముకున్నారు.

మతి పోగొడుతున్న ఆదిపురుష్ :
ఆదిపురుష్ మూవీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ముగిసిందని సమాచారం. కోట్ల రూపాయల డీల్స్ తో బయటకొచ్చిన ఈ లెక్కలు ప్రభాస్ స్టామీనా మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాకు 155 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని సమాచారం.
రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ, రాముడిగా ప్రభాస్ నటించడం, ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాను చూడటానికి చాలా మంది ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి. ఆదిపురుష్ చేసిన బిజినెస్ చూస్తుంటే.. అభిమానులు మాత్రమే ఈ సినిమాను గట్టెక్కించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు