Adipurush: రాధే శ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చిత్రం ఆది పురుష్. సినిమా నిర్మాణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తున్నాడు. ఇక లుక్ పరంగా ప్రభాస్ రాముని వేషధారణలో చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి పాత్రలో ప్రభాస్ నటించడం ఇదే తొలిసారి. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ తన తీయబోయే ప్రతి సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాడు. ఇలా సాహో, రాధే శ్యామ్ సినిమాలను విడుదల చేసినా అవి ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేక పోయాయి.
ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి మొత్తం ఆది పురుష్ పైనే ఉంది. ఆ సినిమా యూనిట్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. అలా ఈ మధ్యే విడుదలైన ఆది పురుష్ టీజర్ కి మిశ్రమ స్పందన లభిస్తుంది. అయితే వీఎఫ్ఎక్స్ విషయంలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
ఇలా ఎన్.వై వీఎఫ్ఎక్స్ వాలా అనే సంస్థను టార్గెట్ చేసారు. వీఎఫ్ఎక్స్ విషయంలో కొంత జాగ్రత్త పడితే బాగుండేదని అని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సంస్థని టార్గెట్ చేయడానికి కారణం. దర్శకుడు ఓం రావత్ టీజర్ విడుదల సమయంలో ఆ సంస్థని టాగ్ చేయడమే.
Adipurush:
అయితే ఈ సమయంలోనే సంస్థ ఆ సినిమా కి “అసలు మేము పని చేయలేదు” అని ఒక ప్రకటన విడుదల చేసింది. ఓం రావత్ ఈ సంస్థని ట్యాగ్ చేయడం వల్ల ఎన్.వై వీఎఫ్ఎక్స్ సంస్థ అభిమానులకి సమాధానం చెప్పుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ఈ సంస్థని నడిపిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది