యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో త్రీడీలో విజువల్ వండర్ సిల్వర్ స్క్రీన్ పై ఓం రౌత్ చూపించబోతున్నాడు. రామాయణం కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతూ ఉండటంతో దర్శకుడు ఇప్పటి వరకు వచ్చిన వాటి కంటే కొత్తగా ఏ విధంగా ఆదిపురుష్ మూవీని ఆవిష్కరిస్తారు అనే సందేహం అందరిలో నెలకొని ఉంది. రామాయణం కథని సినిమాలు, సీరియల్స్ ద్వారా చూసి చూసిన మనకి ఒకే విధమైన కథనం అవగతం అవుతుంది. అలాంటి ఆడియన్స్ ఆలోచనలని అడ్వాన్స్ గా తీసుకెళ్లి సరికొత్తగా ఆదిపురుష్ ని ఓం రౌత్ ఆవిష్కరించాడు.
తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ చూస్తూ ఉంటే అర్ధమవుతుంది. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై రాని విధంగా యాక్షన్ థ్రిల్లర్ గా రామాయణాన్ని ఆదిపురుష్ మూవీ ద్వారా ఆవిష్కరించాడు అని విజువల్ ప్రెజెన్స్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది. బేస్ లైన్ మార్చకుండానే రామ, రావణ యుద్ధాన్ని హాలీవుడ్ మార్వల్ సిరీస్, అవతార్ లాంటి సినిమాలకి ఏ మాత్రం తీసిపోని విధంగా అద్భుతమైన ఎలిమెంట్స్ తో ఆధ్యంతం నింపేశారు. ఇక రాక్షసులు, వానరులు, మానవుల మధ్య వ్యత్యాసం గత రామాయణ కథలతో వచ్చిన సినిమాలలో పెద్దగా ఉండేది కాదు. ఇందులో వానరులు అంటే కోతులు అనే విధంగానే చూపించారు. అలాగే రాక్షసులు అంటే అత్యంత భయంకరమైన రూపాలని తెరపై ఆవిష్కరించారు. కోతుల సైన్యాన్ని ఉపయోగించుకొని రాక్షస సైన్యంపై రాముడు సాగించిన యుద్ధాన్ని టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లో చూపించి సూపర్బ్ అనిపించుకున్నారు.
ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా యాక్షన్ ఘట్టాలని మరింత ఎలివేట్ చేసే విధంగా ఉండటం హైలైట్. ఇక ఇండియన్ సూపర్ హీరో రేంజ్ లో రాముడి పాత్రని ఆదిపురుష్ సినిమాలో ఓం రౌత్ ఆవిష్కరించి అద్భుతాన్ని చూపించాడు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ కారణంగా ప్రభాస్ లుక్ యానిమేషన్ తరహాలో ఆరంభంలో కనిపించిన ఓవరాల్ గా టీజర్ మొత్తం వన్ లైన్ వండర్ అనిపించుకుంది. దానికి తగ్గట్లుగానే టీజర్ యుట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేసే దిశగా దూసుకెళ్తుంది. తెలుగు, హిందీ బాషలలో టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తెలుగులో కంటే హిందీలో కేవలం గంటలోనే 2.2 మిలియన్స్ మంది వీక్షించారు. తెలుగులో అయితే వన్ మిలియన్ వ్యూస్ దాటిపోయింది. ఇక ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లోబల్ ట్రెండింగ్ గా కొనసాగుతుంది. అలాగే సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది.