యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, ఓం రౌత్ దర్శకత్వంలో బాలీవుడ్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. రామాయణం కథ ఆధారంగా చేసుకొని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో అడ్వాన్సడ్ లెవల్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ మూవీలో కృతి సనన్ సీతగా కనిపించబోతు ఉండగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడుగా కనిపించబోతున్నాడు. ఇక రావణ్ దృక్కోణం నుంచి ఈ రామాయణం కథని నేరేట్ చేసినట్లు గతంలోనే దర్శకుడు ఓం రౌత్ స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు. సినిమా ఎలా ఉంటుంది. రాముడి పాత్రలో ప్రభాస్ ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
అయితే సినిమా నుంచి ఒక్క అప్డేట్ కూడా బయటకి రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే తాజాగా దర్శకుడు ఓం రౌత్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు అందరికి అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు స్పష్టం చేశారు. ఆదిపురుష్’ టీజర్‌ను అక్టోబర్ 3న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. రాముని జన్మస్థలం అయోధ్యలో టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నారని సమాచారం.
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ఈ మైదానంలో అక్టోబర్ 5న జరిగే రావణ దహన కార్యక్రమానికి ప్రభాస్‌ని ముఖ్య అతిథిగా నిర్వహకులు ఆహ్వానించారని తెలుస్తుంది. రావణుడ్ని దహనం ప్రభాస్ చేతుల మీదుగా ఈ సారి అక్కడ జరగబోతుంది. రెబల్ స్టార్ రాముడి పాత్రలో కనిపించడనుండటంతోనే ఈ కార్యక్రమానికి పిలిచారని టాక్. ఆదిపురుష్ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ నేపధ్యంలో ముందు నుంచే సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ఈ టీజర్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.