యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రామాయణం కథ ఆధారంగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఓం రౌత్ దీని గురించి చెప్పుకుంటున్నారు. కృతి సనన్ ఈ మూవీలో సీత పాత్రలో నటించగా, సైఫ్ అలీఖాన్ రావణుసుర పాత్రలో అలరించబోతున్నాడు. ఇక రాముడిగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ఇప్పటికే టీజర్ అనౌన్సమెంట్ పోస్టర్ లో ఓం రౌత్ ఆవిష్కరించి అందరిని సర్ప్రైజ్ చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది.
రాముడి పాత్రకి ఎవరు కరెక్ట్ గా ఉన్నారనే విషయంలో ఇప్పుడు ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య హాట్ వార్ నడుస్తుంది. ఇది కూడా ఆదిపురుష్ మూవీని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చింది. ఇక ఈ మూవీ టీజర్ ని అయోధ్య వేదికగా ఈ రోజు లాంచ్ చేసి ప్రమోషన్ ప్రారంభించబోతున్నారు. ప్రభాస్ కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటాడు. ఇక ఈ ఈవెంట్ కి సంబందించిన వెన్యూ ఇప్పుడు రెడీ అవుతుంది. దానికి సంబందించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ అవుతుంది.
Adipurush Teaser & First Poster Launch Preparations are going on In Ayodhya #JaiShriRam #Prabhas𓃵 #Prabhas #Adipurush #AdipurushTeaser #AdipurushFirstLook #AdipurushMegaTeaserReveal #AdipurushinAyodhya pic.twitter.com/ltg7SMNDrV
— Manu ❤️ (@ManojPrabhas23) October 1, 2022
ఒక టీజర్ కోసం భారీ ఎత్తున వెన్యూ ఏర్పాటు చేయడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అయితే ఈ మూవీని ఇండియన్ ప్రైడ్ గా, మన ఇతిహాసం, రామాయణం ఇతివృత్తంగా రిప్రజెంట్ చేయడం, హిందుత్వ వాదం ప్రస్తుతం బలంగా ప్రజలలోకి వెళ్లడంతో దేశ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా వైపు చూస్తుంది. ఈ నేపధ్యంలోనే అందరిని ఎట్రాక్ట్ చేయడానికి ఈ స్థాయిలో టీజర్ లాంచ్ కోసం వెన్యూని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకి ఆదిపురుష్ టీజర్ లాంచ్ కాబోతుంది. మరి ఈ టీజర్ ఎన్ని రికార్డులని బ్రేక్ చేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన అంశంగా మారిపోయింది.