యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఊహించని స్థాయిలో టీజర్ కి భారీ స్పందన వచ్చింది. తెలుగులో కంటే హిందీలో ఆదిపురుష్ టీజర్ ని ఎక్కువ మంది వీక్షించడం ద్వారా అక్కడి ఆడియన్స్ ప్రభాస్ సినిమాపై ఎంత ఆసక్తి చూపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఆదిపురుష్ మైథలాజికల్ కథ రామాయణం ఆధారంగా తెరకెక్కడంతో దీనిపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ నేపధ్యంలోనే ఈ మూవీ రామాయణం బేస్ చేసుకొని వచ్చిన మిగిలిన సినిమాలు, సీరియల్స్ కంటే ఏ విషయంలో కొత్తగా ఉంటుందనే ఉత్సుకత కూడా ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. ఇన్ని ఇంటరెస్టింగ్ విషయాల మధ్య అయోధ్య వేదికగా ఆదిపురుష్ టీజర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విపరీతంగా టీజర్ ని చూసేందుకు ఎగబడ్డారు.
టీజర్ అద్భుతంగా, గ్రాండియర్ గా సరికొత్త ఫీల్ ని అందించింది. విజువల్ ఎఫెక్ట్స్ తో రామాయణాన్ని ఇది వరకు ఎవ్వరు చూపించని విధంగా పెజెంట్ చేసే ప్రయత్నం ఓం రౌత్ చేశారు. అయితే సినిమాలో గ్రాఫిక్స్ ని ఒరిజినల్ ఫీల్ కల్పించడంలో ఓం రౌత్ మెప్పించలేకపోయాడు. ప్రభాస్ లుక్, వాకింగ్ స్టైల్ నుంచి రావణుడు ఆకాశంలో వచ్చే వింత పక్షి రూపం, అలాగే వానర సైన్యం, రాక్షస సైన్యం అంతా కూడా గ్రాఫిక్స్ తో క్రియేట్ చేసిన పాత్రలే. వాటి రూపాలు ఏ మాత్రం నేచురాలిటీకి దగ్గరగా లేకపోవడం టీజర్ పై కొంత నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయ్యింది. కంటెంట్ కొత్త అనుభూతిని ఇస్తున్నా కూడా గ్రాఫిక్స్ చాలా పూర్ గా ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఈ గ్రాఫిక్స్ పై ఇంకా వర్క్ చేయాల్సిన అవసరం ఉందని, కొత్తగా చూపించే ప్రయత్నంలో ప్రెజెంట్ చేసే విధానం ఎంత ముఖ్యమో కూడా చూసుకోవాలనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ ని కార్టూన్ పాత్ర తరహాలో డిజైన్ చేశారనే కామెంట్స్ వస్తున్నాయి. ఓం రౌత్ ఈ విషయంలో అస్సలు కేర్ తీసుకోలేదని, ఆదిపురుష్ బజ్ ని క్యాచ్ చేసుకోవాలనే ప్రయత్నం తప్ప పెర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేయలేదనే విమర్శ వస్తుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అతని లుక్ విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో తెరకెక్కించిన అవతార్ సినిమా నేచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఆ పాత్రని గ్రాఫిక్స్ తో అంత అద్భుతంగా తీర్చి దిద్దారు. అలాగే ఆదిపురుష్ గ్రాఫిక్స్ వర్క్ పై మరింత శ్రద్ధ పెట్టి సినిమాకైనా సరికొత్త ఫీల్ ని అందించే విధంగా సిద్ధం చేయాలని అందరూ ఆశిస్తున్నారు. రామాయణం కథతో రాముడిని సూపర్ హీరోగా చూపించాలనే ప్రయత్నం బాగానే ఉన్న దానికి తగ్గ ఎలిమెంట్స్ అయిన విజువల్ వర్క్ చాలా ప్రాధాన్యత ఉన్న సబ్జెక్ట్ అనే విషయం గుర్తిస్తే ఆదిపురుష్ ఇండియన్ హాలీవుడ్ మూవీగా అవతరించడం పక్కా అనే మాట వినిపిస్తుంది.