డార్లింగ్ ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. కృతి సనన్ ఈ సినిమాలో సీత పాత్రలో కనిపిస్తుంది. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. భారీ బడ్జెట్ తో టి సిరీస్ ఈ సినిమాని నిర్మించింది సుమారు 500 కోట్ల వరకు ఈ మూవీపై బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే టీజర్ రిలీజ్ తర్వాత గ్రాఫిక్స్ వర్క్ పైన అలాగే పాత్రల చిత్రణ, ఆహార్యంపై విమర్శలు వచ్చాయి. హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా ఆదిపురుష్ సినిమా ఉందనే టాక్ వచ్చింది.
ఓం రౌత్ దీనిపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసిన హిందుత్వ సంఘాలు వినే పరిస్థితిలో లేవు. దీంతో తప్పనిసరి పరిస్థితిలో భారతీయ మూలాల్ని వదలకుండా అందరూ శ్రీరాముడు పాత్రని ఏ విధంగా చూస్తారో అలాగే చూపించాలని దర్శకుడు ఓం రౌత్ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపధ్యంలో గ్రాఫిక్స్ వర్క్ పై మళ్ళీ వర్క్ చేస్తూ మరింత బెస్ట్ అవుట్ పుట్ ని సిద్ధం చేసేందుకు ఆరు నెలలు రిలీజ్ పోస్ట్ పోన్ చేశారు.
ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ ఖాతాలో ఇప్పుడు మరో అరుదైన రికార్డు చేరింది. ఈ టీజర్ 24 గంటల్లోనే అన్ని భాషలలో కలిపి 100 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకొని అరుదైన ఫీట్ ని నమోదు చేసింది. ఇప్పుడు ఒక్క హిందీ బాష టీజర్ 100 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది. దీనికంటే ముందు కేజీఎఫ్ చాప్టర్ 2 ఈ క్లబ్ లో చేరిన టీజర్ గా ఉంది. అయితే కేజీఎఫ్ చాప్టర్ 2 కంటే తక్కువ సమయంలోనే ఆదిపురుష్ ఈ 100 మిలియన్ వ్యూస్ ఫీట్ ని అందుకోవడం విశేషం.