బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్,కృతి సనన్ జంటగా నటిస్తున్న మూవీ ఆదిపురుష్.ప్రముఖ సంగీత దిగ్గజం అయిన టి సీరీస్ నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు,హిందీలో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.ఇప్పటివరకు పౌరాణిక పాత్రలు వేయని ప్రభాస్ ఈ మూవీలో రాముడిగా,కృతి సనన్ సీతగా,సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించి కనువిందు చేయనున్నారు.
శరవేగంగా ముస్తాబవుతున్న ఈ మూవీ సరిగ్గా ఇప్పటివరకు వందరోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంది.ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ మూవీ షూటింగ్ మరో రెండు మూడు వారాలలో పూర్తవ్వనున్నది.