టాలీవుడ్లో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోన్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన హిందీ చిత్రమే ‘ఆదిపురుష్’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ రూపకల్పనలో రాబోతున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో రూపొందింది. రామాయణం నేపథ్యంతో విజువల్ వండర్గా ఇది తెరకెక్కిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతోన్నాయి.
ఆదిపురుష్ ఈవెంట్.. చరిత్రలో తొలిసారి ఇలా
టెక్నికల్ వండర్గా రాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీని జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రచార చిత్రాలను వదులుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మే 9వ తేదీన ఈ మూవీ ట్రైలర్ను ఆ తర్వాత కొన్ని పాటలను రిలీజ్ చేశారు.

ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జూన్ 6వ తేదీన తిరుపతిలో ఎంతో గ్రాండ్గా జరపబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే అనౌన్స్ చేసింది. దీని కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. దీనికి కొన్ని వేల మంది అభిమానులు హాజరు అయ్యే అవకాశం ఉంది. దీంతో అందుకు తగినట్లుగానే భారీగా ప్లాన్ చేస్తున్నారు.
ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఎంతో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ‘ఆదిపురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం 200 మంది సింగర్లు 200 మంది డ్యాన్సర్లు ప్రదర్శనలు ఇవ్వబోతున్నారట. అంతేకాదు ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బాణాసంచాను కూడా తీసుకు వస్తున్నారని తెలిసింది. వీటిని కాల్చిన సమయంలో ‘జై శ్రీరామ్’ అనే శబ్దాలు వస్తాయని అంటున్నారు.
మొత్తంగా ‘ఆదిపురుష్’ ఈవెంట్ కోసం గతంలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త ఏర్పాట్లను చేసినట్లు అర్థం అవుతోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా.. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా.. దేవదత్తా హనుమంతుడిగా నటించారు.