ఆదిపురుష్ టీజర్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చి ఎ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికి తెలిసిందే. టి-సిరీస్ భూషణ్ కుమార్ ఏకంగా 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. సినిమాలో పాత్రల ఆహార్యంపై కొంత వ్యతిరేకత వస్తున్నా కూడా నిర్మాత మాత్రం ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి సంబందించిన ఒటీటీ, డిజిటల్ రైట్స్ రూపంలో ఇప్పటికే బడ్జెట్ లో సగానికి పైగా కలెక్షన్స్ వచ్చేసింది. అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో వెయ్యి కోట్ల వరకు వ్యాపారం జరిగినట్లు తెలుస్తుంది.
ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధికంగా ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రంగా ఈ మూవీ ఉండబోతుందని ఇప్పటికే బిటౌన్ లో వినిపిస్తుంది. అలాగే ఈ సినిమా కచ్చితంగా రెండు వేల కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. రామాయణం కథ ఆధారంగా సినిమాని తెరకెక్కించిన హాలీవుడ్ స్టైల్ లో కంటెంట్ ని ప్రెజెంట్ జెనరేషన్ ని మరింత చేరువ అయ్యే విధంగా విజువల్ ఎఫెక్ట్స్ తో ఓం రౌత్ ఆవిష్కరించారు. ఇక సినిమాని త్రీడీలో రిలీజ్ చేయబోతున్న నేపధ్యంలో కచ్చితంగా విజువల్ వండర్ గా సినిమా ఉంటుందనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ కాకుండానే దర్శకుడు ఆదిపురుష్ మూవ అవుట్ పుట్ పై నిర్మాత భూషణ్ కుమార్ చాలా నమ్మకంగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో తన హ్యాపీ నెస్ ని ఓం రౌత్ కి ఏకంగా 4 కోట్ల ఫెరారీ సూపర్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చి చూపించాడు. ఇప్పుడు ఈ న్యూస్ బిటౌన్ లోనే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంత ఖరీదైన కారుని గిఫ్ట్ గా ఇచ్చాడంటే సినిమా మీద నిర్మాతగా ఎంత నమ్మకం ఉండి ఉంటుందో కదా అని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా దానిని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.