రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో టి సిరీస్ ఈ సినిమాని నిర్మించింది. రామాయణం కథ ఆధారంగా ఆదిపురుష్ మూవీ తెరకెక్కడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే సినిమాని గ్రాండియర్ గా త్రీడీ మోషన్ క్యాప్చర్ లో సినిమాని వెండితెరపై చూపించడానికి దర్శకుడు ఓం రౌత్ సిద్ధం అవుతున్నారు. ముందుగా టీజర్ ని రిలీజ్ చేసి సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. టీజర్ తో అంచనాలు పెరగడంతో పాటు కాంట్రవర్సీ కూడా అయ్యింది. రామాయణం కథని వక్రీకరిస్తున్నారని దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. దీనిపై ఓం రౌత్ ఎన్ని క్లారిటీలు ఇచ్చిన విమర్శలు మాత్రం ఆగలేదు.
హిందువులు విశ్వాసాలకి లోబడి ఎలాంటి ప్రయోగాలైన చేసుకోవాలి అనే విషయాన్ని హిందుత్వ వాదులు అందరూ చెప్పారు. మతవిశ్వాసాలకి విరుద్ధంగా పాత్రల చిత్రణ ఉంటే అంగీకరించడానికి సిద్ధంగా లేరు. ఈ విషయం దర్శకుడు ఓం రౌత్ కి కూడా అర్ధమైంది. ఇక అవతార్ సీక్వెల్ మూవీ త్వరలో రాబోతుంది. ఇది కూడా మోషన్ క్యాప్చర్, త్రీడీలోనే రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ లో ఎక్కడా కూడా గ్రాఫిక్స్ అనే ఫీలింగ్ రాకుండా పెర్ఫెక్ట్ గా జేమ్స్ కామెరూన్ ఆవిష్కరించారు.
ఈ మూవీ ఎఫెక్ట్ ఆదిపురుష్ మీద కూడా పడుతుందని సినిమా గ్రాఫిక్స్ వర్క్ చూసిన తర్వాత దర్శకుడు ఓం రౌత్ కూడా రియలైజ్ అయ్యారని టాక్. ఈ నేపధ్యంలోనే సినిమా రిలీజ్ వాయిదా వేసి మళ్ళీ గ్రాఫిక్స్ ని మరింత క్వాలిటీతో అందించే విధంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయ్యారు. కంటెంట్ కి ఎలాగూ డిమాండ్ ఉంటుంది కాబట్టి. ధైర్యం చేసి మరో 100 కోట్లు అదనంగా ఆదిపురుష్ గ్రాఫిక్స్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తుంది. పాత్రల చిత్రణలో కూడా కీలక మార్పులు చేస్తున్నారని సమాచారం. ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లతో కలిసి ఏకంగా 500 కోట్లు దాటిపోయిందని బిటౌన్ లో వినిపిస్తుంది.