Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ ఆదిరెడ్డి చాలా తెలివైన గేమ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. తన యూట్యూబ్ ఛానల్ లో గత బిగ్ బాస్ సీజన్ లకి సంబంధించి రివ్యూ ఇస్తూ మంచి గుర్తింపు ఆదిరెడ్డి తెచ్చుకోవటం జరిగింది. అయితే ఇప్పుడు ఏకంగా సీజన్ సిక్స్ లో అదిరిపోయే స్ట్రాటజీలతో గేమ్ ఆడుతూ ఉన్నారు. హౌస్ లో ఎవరితో అయినా గేమ్ ఆడాలన్న..పక్క గేమ్ ప్లాన్ తో .. చాలా అలర్ట్ గా ఆదిరెడ్డి రాణిస్తున్నారు. అయితే గత ఐదు రోజులలో ఆదిరెడ్డి హౌస్ లో ఎక్కువగా ఉన్నది.. గీతూ రాయల్ తో మాత్రమే.
హౌస్ లో ఆది రెడ్డి ఎక్కువగా ఆమెతోనే డిస్కషన్ పెడుతూ ఉన్నారు. బిగ్ బాస్ ఇంటిలో వాతావరణం గురించి…ఇతర ఇంటి సభ్యులు గురుంచి ఆదిరెడ్డి ఎక్కువగా ఓపెన్ అవ్వుతుంది గీతు దగ్గరే. ఇదిలా ఉంటే సీజన్ సిక్స్ అన్ సీన్ సన్నివేశాలలో.. ఆదిరెడ్డి చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. మేటర్ లోకి వెళ్తే.. కిచెన్ లో భోజనం చేశాక ఆదిరెడ్డి ఇంకా గీతు మాట్లాడుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆదిరెడ్డి నామినేషన్ ప్రక్రియ గురుంచి మాట్లాడుతూ.. ఫ్రెండ్స్ యొక్క బలహీనతలు చెబుతాను గాని హౌస్ లో మాత్రం నా స్నేహితులను ఎప్పుడూ కూడా నామినేట్ చేయను అని గీతు నీ ఉద్దేశించి చెప్పడం జరుగుద్ది.
దీంతో గీతు.. ఆఖరికి ఆ సమయంలో నామినేషన్ చేయటానికి ఎవరిపైన కారణాలు లేకపోతే.. అనేసరికి.., అదే పరిస్థితి వస్తే కచ్చితంగా మిమ్మల్ని నామినేట్ చేస్తాను అంటూ ఆదిరెడ్డి.. తెలియజేశారు. ఏది ఏమైనా హౌస్ లో.. గీతు తన ఫ్రెండ్ అని ఆదిరెడ్డి తెలియజేయడం జరిగింది.