Biggboss 6 : బిగ్ బాస్ సీజన్ 6 ఆదివారం చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. మొత్తం 21 మంది కంటిస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లారు. ఆరుగంటలకి బిగ్ బాస్ షో స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. వీరిలో కొంత మంది తెలిసిన వారే ఉన్నా మరి కొంత మంది మాత్రం కొత్తవాళ్లు ఉన్నారు. ఒకరిద్దరు తప్ప మిగిలిన వారిద్దరూ కెరియర్ స్టార్ట్ చేసి బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నవారే కావడం విశేషం. వారిలో రాజశేఖర్, అర్జున్ కళ్యాణ్, ఆరోహిరావు, ఇనయా సుల్తానా, శ్రీహాన్ లాంటివారు ఉన్నారు. వీరితో పాటు ఫేడ్ అవుట్ అయ్యి మళ్ళీ గ్రాండ్‌గా తనని తనకు పరిచయం చేసుకోవాలని అనుకుంటున్న అభినయశ్రీ షోకి స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇక రియల్ కపుల్ రోహిత్- మెరీనా సైతం బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇక కంటెస్టెంట్లు అందరిలోకి ప్రేక్షకులకు బాగా తెలిసిన వారు ఎవరైనా ఉన్నారంటే.. బాలాదిత్య, చలాకీ చంటి. బాలాదిత్య విషయం పక్కనబెడితే చలాకీ చంటి గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. సినిమాల ద్వారా కొంత జబర్దస్త్ షో ద్వారా ప్రతి గడపకూ చేరిపోయాడు. ఐదో కంటెస్టెంట్‌గా కమెడియన్ చలాకీ చంటి ఎంట్రీ ఇచ్చాడు. చంటి ఎంట్రీ కంటే ముందు ఆయన ఏవీ చూపించారు. ‘చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి వదిలేసి వెళ్లిపోయాడు. ఒడిదుడుకులున్న ఒంటరి జీవితం నాది అలాంటి సమయంలోనే నా భార్య నా లైఫ్‌లోకి వచ్చింది. పెళ్లిచూపుల్లో అంతా సెట్ అనుకున్న సమయంలో సినిమా వాళ్లకి పిల్లనెందుకు ఇవ్వడం అని నా భార్య పేరెంట్స్ ఆలోచించారు. అప్పుడు వాళ్లతో గొడవపడి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు మా అల్లుడు బంగారం అని వాళ్లు అంటారు’ అంటూ చంటీ తనను తాను పరిచయం చేసుకున్నాడు.
Biggboss 6 : ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడేస్తారు..
ఇక జబర్దస్త్‌లో చూసిన ప్రకారమైతే మనోడికి ఈగో వైఫ్‌లా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. గతంలో అతని ఈగోపై తోటి కంటెస్టెంట్లు తెగ పంచ్‌లు పేలుస్తూ ఉండేవారు. చివరకు జబర్దస్త్ విన్నర్‌గా ప్రకటిస్తే కూడా తనకు వద్దని చెప్పేశాడు. దీనిపై సైతం తోటి కంటెస్టెంట్లు స్కిట్స్‌లో సరదాగా విమర్శించేవారు. తర్వాతర్వాత మారినట్టు కనిపించినా కూడా ఒరిజినల్ మాత్రం లోపలే ఉండిపోతుంది కదా. బిగ్‌బాస్ అంటే కేవలం నవ్వించడమే కాదు.. ఎదుటి వ్యక్తిని కవ్వించడం.. అవసరమైతే రెచ్చగొడతారు.. ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడేస్తారు. మరి మనోడు వీటన్నింటినీ సహించి ఈగోకి వెళ్లకుండా ఉంటాడా? లేదా? అనేది చూడాలి. ఒకటైతే నిజం బిగ్‌బాస్ హౌస్‌లో చంటి ఉన్నంత కాలం కామెడీకి ఎలాంటి ఢోకా ఉండదు.