Varalakshmi Sarathkumar: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వరలక్ష్మి శరత్ కుమార్ అన్న పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేసి సినిమా క్రాక్. టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.
ఇంకా చెప్పాలి అంటే చాలామంది వరలక్ష్మి శరత్ కుమార్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ క్రాక్ సినిమాలో జయమ్మ అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా ఈ సినిమాతో గుర్తింపుతెచ్చుకుంది. ఈమె తెలుగుతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. భాష ఏదైనా కూడా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది వరలక్ష్మి శరత్ కుమార్.
అయితే ఈమె ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ ఉంటుంది. ఈమె ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు నెగిటివ్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం తెలుగులో వరుసగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. క్రాక్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్ అదే ఊపుతో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
అంతేకాకుండా ఈమె కోలీవుడ్ పలు సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే కేవలం నటనకు మాత్రమే కాదు అందాల ప్రదర్శనకు కూడా సై అంటుంది వరలక్ష్మి శరత్ కుమార్. అయితే క్రాక్ సినిమా సమయంలో కాస్త లావుగా కనిపించిన జయమ్మ ఆ తర్వాత సన్నగా మారి అందాల ప్రదర్శన కూడా చేస్తోంది. ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తోంది.
అంతేకాకుండా అప్పుడప్పుడు తన అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులకు చేరువగా ఉంటుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ లో కూడా చేస్తూ ఉంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె జీన్స్ అండ్ వైట్ టాప్ ధరించింది. కాగా అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.