ఇస్మార్ట్ రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ని దసరా రోజు చెబుతామని చిత్ర యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. పాన్ ఇండియా రేంజ్ లో బోయపాటి నుంచి రాబోతున్న మొదటి సినిమా ఇది కావడం. అలాగే హీరో రామ్ కి కూడా పాన్ ఇండియా రేంజ్ లో తనని తాను ప్రాజెక్ట్ చేసుకునే ప్రాజెక్ట్ కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నారు. రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతుంది.
అఖండ తర్వాత బోయపాటి నుంచి రాబోతున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఏజెంట్ మూవీ హీరోయిన్ సాక్షి వైద్యని కన్ఫర్మ్ చేసారనే టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు అ బ్యూటీని ఏవో కారణాల వలన తప్పించి ఆమె స్థానంలో శ్రీ లీలని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తుంది. ప్రస్తుతం ఆమె రవితేజతో చేసిన ధమాకా మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది. దీంతో పాటు ఏకంగా ఏడు సినిమాల వరకు లైన్ లో ఉన్నాయి.
అన్ని కూడా పెద్ద ప్రాజెక్ట్స్ కావడం విశేషం. ఇక ఇప్పుడు రామ్ పోతినేనికి జోడీగా బోయపాటి సినిమాలో కూడా హీరోయిన్ గా ఈమెని కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఏకంగా ఎనిమిది సినిమాలని లైన్ లో పెట్టినట్లు అయ్యింది. తెలుగులో ఒకే ఒక్క ఫ్లాప్ మూవీతో ఏకంగా ఎనిమిది సినిమాలకి సైన్ చేయడం ద్వారా భవిష్యత్తులో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ లో ఒకరుగా ఈ బ్యూటీ ఫిక్స్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.