Actress Sheela: షీలా దక్షిణ భారత చలనచిత్ర నటి. ఈమె 1989లో చెన్నైలో జన్మించింది. ఈయన తండ్రి ధనుంజయ్ ఒక బ్యాంకు ఉద్యోగి. బాలనటిగా తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన షీలా, మొదటిసారిగా పూం కాట్రు తిరుంబుమా అనే చిత్రంలో నదియాకు కూతురిగా నటించింది.
మణిరత్నం దర్శకత్వం వహించిన డుం డుం డుం చిత్రం ద్వారా బాల్య నటిగా తెలుగు తెరకు పరిచయమైంది. బాలనటిగా దాదాపు 20 కి పైగా సినిమాలలో నటించింది. 2006లో నవదీప్ సరసన సీతాకోకచిలుక చిత్రం ద్వారా హీరోయిన్ గా మొదటి చిత్రం నటించింది. వరుసగా తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలో కూడా నటించడం జరిగింది.
తెలుగులో పరుగు, మస్కా, అదుర్స్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇక దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుందని చాలామంది అనుకున్నారు. అన్ని భాషలలో కూడా గుర్తింపు రావడంతో ఇక తిరుగులేదు అనుకున్న ఆమె జీవితంలో ఎవరు ఊహించని మలుపు తిరిగింది.
ఒక నిర్మాతతో లవ్ లో ఉందని, ఆ నిర్మాత సినిమాలలో నటించడానికి అభ్యంతరం చెప్పి తనకు కావాల్సినవన్నీ చూసుకుంటానని చెప్పడంతో ఇక సినిమాలకు దూరమైందని, ఆ నిర్మాత చెప్పు చేతుల్లో ఉందని వార్తలు సోషల్ మీడియాలో బాగానే వినిపించాయి. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఆమె దీనస్థితిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Actress Sheela:
దీనికి కారణం సినిమాలకు దూరంగా ఒంటరిగా ఉండి డిప్రెషన్ లోకి వెళ్లి ఉండవచ్చని, ఒంటరిగా ఏం చేయాలో తోచక చెడు అలవాట్లకు లోనైందని, దీనితో ఆమె ఆరోగ్యం కూడా దెబ్బతినిందని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నటనపై ఆసక్తి ఉండి సడన్ గా సినిమాలకు బ్రేక్ చెప్పడంతో ఇలా డిప్రెషన్లోకి వెళ్లి ఉండవచ్చని చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.