టాలీవుడ్ లో దేవి సినిమా అంటే అందరికి వెంటనే గుర్తుకొచ్చే పేరు ప్రేమ. కన్నడ నాట స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అయిన ఈ బ్యూటీ ధర్మచక్రం సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వరుస అవకాశాలతో అందుకుంది. వెంకటేష్, నాగార్జున, జగపతి బాబు లాంటి స్టార్స్ తో ఆడిపాడింది. తెలుగులో వరుస సినిమాలతో అవకాశాలు అందుకోవడంతో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. తెలుగు, కన్నడ భాషలలో ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చింది. ఇక కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన దేవి సినిమా అయితే ప్రేమకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ఆ తరువాత తెలుగులో ఈమె కెరియర్ ఫాల్ డౌన్ అవ్వడం మొదలైంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా చేసిన సినిమా చిరునవ్వుతో. రామ్ ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వేణు హీరోగా నటించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అలాగే త్రివిక్రమ్ రైటింగ్ టాలెంట్ కూడా టాలీవుడ్ కి ఈ మూవీతో పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమాలో ప్రేమ, సెరీన్ హీరోయిన్స్ గా నటించారు. అయితే ఈ మూవీ కారణంగా తన కెరియర్ పోయిందని తాజాగా హీరోయిన్ ప్రేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. చిరునవ్వుతో స్టోరీ తనకి త్రివిక్రమ్ శ్రీనివాస్ నేరేట్ చేశారని చెప్పింది. అయితే కథ చెప్పిన సమయంలో తనదే మెయిన్ హీరోయిన్ పాత్ర అని, తన క్యారెక్టర్ చుట్టూనే కథ నడుస్తుందని చెప్పారు.
ప్రేమించిన భావ మోసం చేయడంతో వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇబ్బందులు పడే పాత్రలో తాను ఆ సినిమాలో నటించానని ప్రేమ చెప్పింది. ఇక సినిమా రిలీజ్ తర్వాత చూసుకుంటే తన రోల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ అన్నట్లు ఉందని చెప్పడం విశేషం. తనకి కథ చెప్పినపుడు ఓ విధంగా ఉంటే రిలీజ్ తర్వాత చూసుకుంటే నా రోల్ కంప్లీట్ గా మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఆ సినిమా తర్వాత తెలుగులో నాకు అన్ని అలాంటి పాత్రలే వచ్చాయని, కంప్లీట్ గా నా కెరియర్ పోయిందని త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ప్రేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతకు ముందు వరకు హీరోయిన్ పాత్రలు చేసిన నా కెరియర్ ని చిరునవ్వుతో సినిమా కంప్లీట్ గా కిల్చేసిందని చెప్పుకొచ్చింది.