సీమటపాకాయ్ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన మలయాళీ భామ పూర్ణ. ఈ అమ్మడు సొంత పేరు వేరు అయిన కూడా సినిమాలో అందరికి చేరువ కావడం కోసం స్క్రీన్ నేమ్ గా పూర్ణ అని పెట్టుకున్నట్లు తెలుస్తుంది. సీమటపాకాయ్ కంటే ముందుగానే శ్రీహరి మహాలక్ష్మి అనే సినిమాలో ఆమె లీడ్ రోల్ లో నటించింది. అయితే ఈ మూవీ ఫ్లాప్ కావడంతో పూర్ణకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. సీమటపాకాయ్ సక్సెస్ తో తరువాత టాలీవుడ్ లో బాగానే ఆఫర్స్ సొంతం చేసుకుంది. గత కొన్నేళ్ల నుంచి హీరోయిన్ పాత్రలకి స్వస్తి చెప్పి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పూర్ణ రాణించే ప్రయత్నం చేస్తుంది.
మరో వైపు రియాలిటీషోలలో జడ్జ్ గా కనిపిస్తుంది. ఈ డాన్స్, కామెడీ రియాలిటీ షోలలో తరుచుగా ఈ బ్యూటీ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే పూర్ణ కొద్ది రోజుల క్రితం గ్రాండ్ గా తమ ముస్లిం సంప్రదాయ పద్దతిలో పెళ్లి చేసుకుంది. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి వేడుక జరిగింది. ఇందులో పూర్ణ భర్త ఆమెకి ఏకంగా 1700 గ్రాముల బంగారం కానుకగా ఇచ్చాడని తెలుస్తుంది. అలాగే దుబాయ్ లో ఒక విల్లా కూడా ఆమె పేరు మీద రాసినట్లు తెలుస్తుంది.
పూర్ణ భర్త దుబాయ్ లో ప్రముఖ వ్యాపారవేత్త. అతని పేరు అసిఫ్ అలీ. చాలా రోజుల క్రితం వీరిద్దరికి ఎంగేజ్మెంట్ అయిపొయింది. తాజాగా దుబాయ్ లో వీరి పెళ్లి జరిగిపోయింది. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ధ్రువీకరించింది. తాజాగా తన పెళ్లి ఫోటోలని కూడా మీడియాకి రిలీజ్ చేసింది. ఇప్పుడు అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తానికి పూర్ణ కోటీశ్వరుడిని భర్తగా పొందిందని ఆమెకి భర్త ఇచ్చిన కానుకలు చూసి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పెళ్లి వేడుకలో ఆమె వేసుకున్న నగలు కూడా భారీగానే ఉండటంతో అవి కాస్తా వైరల్ అవుతున్నాయి.