Actress Poorna: తెలుగు సినీ ప్రేక్షకులకు నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన సీమటపాకాయ్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో మంచి నటిగా మంచి గుర్తింపును ఏర్పరచుకుంది పూర్ణ ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యింది.
ఇకపోతే పూర్ణ ఇటీవల విడుదల అయిన సిల్లీ ఫెలోస్ అఖండ,దృశ్యం 2 లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వీటిలో బాలయ్య బాబు నటించిన అఖండ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు కూడా అందుకుంది.
కాగా ప్రస్తుతం పూర్ణ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు బుల్లి తెర పై ప్రసారమయ్యే పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు ఈవెంట్ లలో తన డాన్స్ పర్ఫామెన్స్ లతో అదరగొడుతోంది పూర్ణ.
కాగా ఇటీవలే పూర్ణ యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీతో ఎంగేజ్మెంట్ ను జరుపుకొన్ని ఒక్కసారిగా అభిమానులకు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా పూర్ణ కెరిర్ పరంగా ఎంత బిజీబిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా చీరకట్టు అందాలతో యువతకి చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఇలా ఉంటే తాజాగా పూర్ణా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఆ ఫోటోలలో బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్సును ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. కర్లీ హెయిర్స్ తో నవ్వుతూ కవ్వించే చూపులతో యువత దృష్టిని ఆకర్షిస్తోంది పూర్ణ. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే పూర్ణ ప్రస్తుతం పలు ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.