Actress Meena: తమిళ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోయిన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి మీనా.ఇలా తెలుగు తమిళ భాషలలో ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.ఇండస్ట్రీలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మీనా విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు.
ఇకపోతే మీనాకు ఒక కూతురు జన్మించిన తర్వాత తనని కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఈమె కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.మీనా జీవితం ఎంత సంతోషంగా సాగిపోతుందనుకున్న క్రమంలో ఆమె జీవితంలో ఓ పెద్ద విషాదం చోటు చేసుకుంది. మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మృతి చెందారు.
ఈ విధంగా ఎంతగానో ప్రేమించే భర్త మృతి చెందడంతో మీనా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ ఎంతో కృంగిపోయారు.ఇక ఈమె దుఃఖ సాగరంలోకి వెళ్లడంతో ఎంతోమంది నటి మనులు తరచూ తన ఇంటికి వెళ్లి తనతో సమయం గడుపుతూ తనతో సరదాగా మాట్లాడుతూ తనని ఆ బాధ నుంచి బయటకు తీసుకు వచ్చారు. ఈ క్రమంలోనే మీనా ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుంచి కోలుకొని బయటకు వస్తున్నారు.
Actress Meena: అది నా డ్రీమ్ క్యారెక్టర్..
ఇలా భర్త మరణం తర్వాత స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకోవడం, ఇతర ప్రదేశాలకు వెళుతూ సందడి చేస్తున్నటువంటి మీనా తాజాగా సోషల్ మీడియా వేదికగా పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ నటించిన నందిని పాత్ర తన డ్రీమ్ క్యారెక్టర్ అని, తనడ్రీమ్ క్యారెక్టర్ లో ఐశ్వర్య రాయ్ నటించినందుకు ఆమెను చూస్తుంటే చాలా జలసీగా ఉందని ఈ సందర్భంగా మీనా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మొదటి సారి తన జీవితంలో ఒక వ్యక్తిని చూసి ఇంతలా అసూయ పడుతున్నానంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.