actress Divya : దివ్య రావ్ బుల్లితెర నటి. ఈమె కాకినాడలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఈమెకు ఒక సోదరుడు ఉన్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. ఈమెకు క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టం. అందుకే చిన్నప్పుడు ఇష్టంతో నేర్చుకుంది. 2008లో జీ షోలో ఓంకార్ నిర్వహించిన ఆట షోలో పాల్గొంది. ఆ తర్వాత 2012లో వచ్చిన ముద్దు బిడ్డ సీరియల్ లో జ్వాలగా విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత వచ్చిన మనసు మమత సీరియల్ లో విలన్ గా నెగటివ్ రోల్ వస్తే అందులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమెకు వరుసగా నెగిటివ్ రోల్స్ అవకాశాలు వచ్చాయి. ఇక జీ టీవీ లో సూపర్ జోడి, ఈటీవీలో సై సై సయ్యారే డాన్స్ షోలో కూడా నటించింది. ఒకవైపు డాన్స్ ప్రోగ్రామ్ లలో, మరొకవైపు సీరియల్ లలో నటిస్తూ బిజీగా రాణిస్తుంది.
ఇక ఒక ఇంటర్వ్యూలో భాగంగా కొత్తగా అవకాశాల కోసం వచ్చే వారి గురించి, ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రాని వారి గురించి కొన్ని సంచలన విషయాలు ఇంటర్వ్యూలో పంచుకుంది. ఏదైనా పాత్రను మనం ఒప్పుకుంటేనే చేయవచ్చు లేదంటే లేదు. మనం ఆ పాత్రలకు కరెక్టా కాదా.. ఆ పాత్రలో నటించడం వల్ల కెరీర్ ఎలా ఉంటుంది అని ముందుగానే ఊహించాలి.
అవకాశం వచ్చింది కదా అని నటిస్తే అది ఓ పెద్ద పొరపాటు.. ముఖ్యంగా నచ్చిన పాత్ర దొరకకపోవడం వల్ల వచ్చిన పాత్రలు చేయడం ద్వారా గుర్తింపు, అవకాశాలు రావచ్చు రాకపోవచ్చు. ఏదైనా పాత్రను ఎంచుకునే ముందు కెరీర్ ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేసుకోవాలి. నటుల జీవితం విజయం ఉంటేనే ముందుకు సాగుతుంది లేదంటే అవకాశాలు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
actress Divya :
అవకాశాలు లేనప్పుడు మనకు నచ్చని పాత్రగా అవకాశం వస్తే నాకు తెలిసి వదులుకోవడమే మేలు దాని ద్వారా ఇతర అవకాశాలు కూడా రాకుండా పోయే అవకాశం ఉంది. ఏదైనా మన చేతుల్లోనే ఉంది. మనం చూసేదాన్ని బట్టి ప్రపంచం ఉంటుంది అని పేర్కొంది. ప్రస్తుతం ఈమె రంగులరాట్నం సీరియల్ లో మహేశ్వరి పాత్రలో విలన్ గా నటిస్తూ, మంచి గుర్తింపు తెచ్చుకుంది. నెగటివ్ రోల్ లో ఈమెకు ఈమె సాటి అన్నట్టుగా నటించడం ఈమె ప్రత్యేకత.