తమ ఆలోచనలు, అభిప్రాయాలని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ఇవి చాలా వేరుగా ఉంటాయి. హీరోయిన్ ఎం చేసిన మీడియా ద్రుష్టి మొత్తం వారి మీదనే ఉంటుంది. సామాజిక దృక్పథం పెంపొందించడానికి హీరోయిన్స్ వారి స్థాయిలో ఏదో ఒక పద్దతిలో సందేశాన్ని సమాజంలో అందరికి అర్ధమయ్యే రీతీలో పంపిస్తారు. గ్లామర్ ప్రపంచంలో ఉన్న అందాల భామలకి సోషల్ కాజ్ కోసం స్పెండ్ చేసేంత టైం ఉండదు. అయితే కొందరు మాత్రం తాము ఎక్కడ ఉన్న సమాజంలోకి తమ ద్వారా చేడు సాంకేతాలు వెళ్లకూడదని అనుకుంటారు. అలాంటి వారిలో సాయి పల్లవి ముందు ఉంటుంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కోసం లక్షలు ఇస్తామన్నా కూడా ఆమె రాదు.
కానీ ఓ సోషల్ కాజ్ కోసం ఈవెంట్ చేస్తూన్నాము అంటే మాత్రం రూపాయి ఇవ్వకున్నా వచ్చి తన వంతు సాయం చేస్తుంది. అలాగే ఇప్పుడు ఓ మరాఠీ యాక్టర్ ఆర్యా ఘారే తన పుట్టిన రోజు వేడుకల్ని కాస్తా వినూత్నంగా జరుపుకుంది. హీరోయిన్ పుట్టినరోజు అంటే కచ్చితంగా అదో పెద్ద సెలబ్రేషన్ లా ఉంటుంది. అలా కాకుండా హీరోయిన్ ఆర్యా ఘారే స్మశానంలో పుట్టినరోజు వేడుకలు చేసుకుంది. ఈ వేడుకలలో కుటుంబ సభ్యులతో పాటు ఆమె నటిస్తున్న చిత్ర దర్శకుడు, నిర్మాత కూడా పాల్గొన్నారు.
ఈ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. అసలు స్మశానంలో పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడానికి గల కారణాలు ఆమె మీడియాతో పంచుకుంది. ధనికులు, పేదలు అందరూ చనిపోయాక స్మశానానికే వస్తారు. సమాజంలో ఉన్న ఈ అంతరాలకి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని తెలియజేయడానికి స్మశానంలో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నట్లు చెప్పింది. అలాగే మూఢ నమ్మకాలపై వ్యతిరేక ప్రచారంలో భాగంగా కూడా వినూత్నంగా తన పుట్టినరోజు జరుపుకున్నట్లు ఆర్య ఘారే చెప్పడం విశేషం. మొత్తానికి ఒక హీరోయిన్ ఇలా స్మశానంలో పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ద్వారా ఒక్కసారిగా నేషనల్ మీడియా దృష్టిని కూడా ఈ సంఘటన ఆకర్షించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.