Actor Vikram: చియాన్ విక్రమ్ పరిచయం అవసరం లేని పేరు కెరియర్ మొదట్లో పలు సినిమాలలో సహాయ నటుడి పాత్రలలో నటించినటువంటి విక్రమ్ అనంతరం హీరోగా, విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఇలాసౌత్ ఇండస్ట్రీ లోను ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విక్రమ్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఈయనకు తమిళంలో ఎలాంటి క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులు ఉన్నారు. తెలుగులో కూడా విక్రమ్ సినిమాలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.ఇక ఏ హీరో కూడా చేయలేనని విభిన్న పాత్రలలో విక్రమ్ నటించిన ఒక్కో సినిమాలో దాదాపు పది పాత్రలలో కూడా ఈయన నటించిన సందడి చేశారు. ఈ విధంగా విక్రమ్ నటించిన మల్లన్న, ఐ, అపరిచితుడు, వంటి సినిమాలు భారీ కలెక్షన్లను రాబట్టి విక్రమ్ కి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టాయి.
ఇకపోతే ఈ మధ్యకాలంలో విక్రమ్ నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ అవుతూ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. అపరిచితుడు సినిమా తరువాత విక్రమ్ నటించిన ఏ సినిమాలో మంచి విజయం అందుకోలేకపోయాయి. ఇకపోతే తాజాగా విక్రమ్ నటించినటువంటి కోబ్రా సినిమాలో ఈయన ఏకంగా 10 పాత్రలలో కనిపించారు. ఈ సినిమా సైతం ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిజాస్టర్ గానే నిలిచింది.
Actor Vikram: విక్రమ్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పడినట్లేనా..
ఇక ఈ సినిమా డిజాస్టర్ కావడంతో విక్రమ్ అభిమానులు ఆశలన్నీ కూడా పొన్నియన్ సెల్వన్ సినిమా పైన పెట్టుకున్నారు.ఈ సినిమా భారీ స్థాయిలో హిట్ అవుతుందని అభిమానులు భావించారు అయితే ఈ సినిమా కూడా విక్రమ్ అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇలా ఈ సినిమా కూడా పెద్దగా ఆదరణ సంపాదించుకోలేకపోవడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విక్రమ్ నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో అభిమానులు సైతం విక్రమ్ సినిమాల పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.