Actor Surya: సూర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని హీరో.మురుగదాస్ దర్శకత్వంలో తెరికెక్కిన గజిని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సూర్య మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్నారు.ఇలా ఈ సినిమాతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకోవడంతో అనంతరం సూర్య నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా తెలుగులో డబ్ అవుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇలా తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సూర్య ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
ఇలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన ఈయన విభిన్నమైన కథ చిత్రాలని ఎంపిక చేసుకుని ఎప్పటికప్పుడు కొత్త తరహా పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. ఇకపోతే తాజాగా సూర్య శివ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.సౌత్‌లో యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను ఇన్ స్పైర్ చేసేలా సౌత్ స్టార్ సూర్య కొత్త సినిమా సూర్య 42 మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కేఈ జ్ఞానవేల్ రాజా సగర్వ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్ చూస్తుంటే సినిమా ఎంతో విభిన్నంగా ఉంటూ కచ్చితంగా ప్రేక్షకులను సందడి చేస్తుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 8వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభమై ఆ రోజు నుంచి రెగ్యులర్ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
Actor Surya: పది భాషలలో సూర్య సినిమా…
ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటాని నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాని ఏకంగా పది భాషలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కోవే సరళ యోగి బాబు వంటి తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీత అందిస్తున్న విషయం మనకు తెలిసిందే.మోషన్ పోస్టర్లో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో అద్భుతంగా ఉండే ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.