Actor Ram: టాలీవుడ్ లో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు రామ్.ఈయన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత ఈయన నటించిన దివారియర్ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా విడుదల సమయంలో రామ్ సైతం సినిమా పై ఎంతో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశారు.
లింగస్వామి సినిమా అంటేనే ప్రేక్షకులలో కూడా కొన్ని అంచనాలు ఏర్పడతాయి. అయితే దివారియర్ సినిమా విషయంలో డైరెక్టర్ లింగస్వామి హీరో రామ్ అభిమానులను మరోసారి నిరాశకు గురి చేశారని చెప్పాలి.ఎన్నో అంచనాల నిడమ విడుదలైన ఈ సినిమా తీవ్ర నిరాశకు గురి కావడంతో తన తదుపరి సినిమా విషయంలో ఇలాంటి తప్పు జరగకూడదని రామ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే రామ్ తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అధికారక ప్రకటన కూడా తెలియజేశారు.అయితే తాజాగా ఈ సినిమాలో రామ్ పాత్ర ఎలా ఉండబోతుందనే విషయానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే రామ్ ఈసారి ఓ కాలేజీ లెక్చరర్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.
Actor Ram: లెక్చరర్ పాత్రలో రామ్
అమ్మాయిల కళాశాలలో వందల మంది అమ్మాయిలు ఉండగా హీరో రామ్ లెక్చరర్ పాత్రలో సందడి చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా కాలేజీలో యంగ్ లెక్చరర్స్ అంటే అమ్మాయిలు ఆ లెక్చరర్ పై ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలోనే రామ్ తన తదుపరి సినిమా కూడా ఇలాగే ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.మరి ఈ సినిమా ద్వారా బోయపాటి రామ్ కి మంచి హిట్ ఇస్తారా లేదంటే ఈయన కూడా హీరో రామ్ కి నిరాశను మిగులుస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.