Acne problem: టీనేజీ యువతలో ఎక్కువగా మొటిమల సమస్య వస్తూ ఉంటుంది. యుక్త వయసు వచ్చే సమయంలో ప్రతి ఒక్కరూ మొటిమలను ఫేస్ చేసే ఉంటారు. అవి మొహం మీద, చేతులపై కనిపిస్తే బాగా చిరాకు వేస్తుంది. అలాంటప్పుడు బయటకు రావాలంటేనే జంకుతుంటారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఈ సమస్య కామన్. మరి మొటిమలు దూరం చేసుకోవాలంటే కొన్ని పదార్థాలను తినకూడదట. అవేంటో చూద్దాం.
మొటిమలు విపరీతంగా రావడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం కూడా ప్రధాన కారణం. అంటే బంగాళాదుంపలు, తెల్ల బ్రెడ్, మైదా పిండితో చేసే పాస్తా, పంచదారతో చేసే ఉత్పత్తులు, సోడా లాంటి వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. తద్వారా చర్మంపై ఆయిల్ పేరుకుపోతుంది. ఆయిల్ వల్ల మొటిమలు ఏర్పడతాయి. అందువల్ల తరచూ మొటిమలు వస్తుంటే ఇలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే మంచి మార్పును చూడవచ్చు.
కొవ్వు పదార్థాలు కలిగిన పాలు, పాల ఉత్పత్తులు, ఐస్ క్రీమ్ వంటి వాటితో కూడా మొటిమలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఆవు పాలలో ఐజీఎఫ్1 అనే ఇన్సులిన్.. హార్మోన్ ను ప్రోత్సహిస్తుందట. ఇది మొటిమలు త్వరగా ఏర్పడటానికి దోహదం చేస్తుంది.
Acne problem:
కెఫెన్ తీసుకుంటే శరీరంలో కార్టిసాల్ పెరిగే ప్రమాదం ఉంది. ఇది ఒత్తిడికి సంబంధించిన హార్మోన్. మనం టెన్షన్ పడినప్పుడల్లా శరీరంలో నూనెను అధికంగా ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది. ఇక ఆల్కహాల్, సిగరెట్ అలవాటున్న వారికి కూడా మొటిమలు అప్పుడప్పుడూ వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది. నూనె పదార్థాలు వీలైంత తగ్గిస్తే మొటిమలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటి వల్ల చర్మానికి నష్టం వాటిల్లుతుంది. అందుకే నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.