AC Side Effects: ఈ మధ్య కాలంలో జనాలు ఏసీ కి బాగా అలవాటు పడిపోయారు. ఎంతలా అంటే ఎండాకాలం గడిచి పోయి మూడు నెలలు కావొస్తున్నా ఏసీ ని మాత్రం వదలట్లేదు. ఎందుకంటే ఎండలు కొంచం తగ్గినట్టే కనిపించినా ఉక్కపోత మాత్రం తగ్గట్లేదు. కేవలం వర్షం పడిన వేళలో మాత్రమే చల్లగా ఉండి మిగతా సమయంలో ఉక్కపోత తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఏసీకి ఎక్కువగా అలవాటు పడిపోయారు. ఇలా ఎక్కువ సమయం ఏసీ లో గడపడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.
తలనొప్పి
ఏసీ లో ఎక్కువగా గడిపే వారికి తల నొప్పి సమస్య ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా బయటి వేడి నుంచి ఒకే సారి ఏసీ గదిలోకి రావడంతో లేదా ఏసీ గదిలోంచి బయటికి వెళ్లడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
శ్వాస సంబంధిత వ్యాధులు
ఇది చాలా మందికి వచ్చే సమస్యే. ఎందుకంటే ఎక్కువ సేపు ఏసీ లో గడపడం వల్ల గొంతు పొడి బారడం మరియు ముక్కు మూసుకుపోవడం వంటి శ్వాస కి సంబందించిన వ్యాధులు తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.
కళ్ళు పొడిబారడం
ఏసీ లో గడపడం వల్ల కంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కళ్ళు పొడి బారడం, దురద వంటి సమస్యలు ఏర్పడతాయి. ఒకే సారి ఏసీ లో నుంచి వేడి ప్రదేశంలోకి వస్తే కళ్ళలో మంటలు ఏర్పడుతాయి.
AC Side Effects: డీ హైడ్రేషన్
ఈ రోజుల్లో ఈ సమస్య ప్రతి వారిలో ఉంటుంది. కానీ ఏసీలో ఎక్కువ సేపు ఉండే వారికి ఈ సమస్య చాలా తొందరగా వస్తుంది. ఎందుకంటే ఏసీ ఆ గదిలోని తేమని గ్రహిస్తుంది. ఈ కారణం చేత తొందరగా డీ హైడ్రేషన్ కి లోనవుతారు.