Bigg Boss: బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే రెండు వారాలు గడిచి మూడో వారంలోకి అడుగుపెట్టింది. రెండు వారాల పాటు సాగిన ఈ బిగ్ బాస్ షోలో 21 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అవ్వకూడదనే సంకల్పంతో బిగ్ బాస్ ఇచ్చిన గేమ్ లను మొదటి వారంలో ఎలిమినేషన్ లేకపోవడంతో అందరూ సేఫ్ అయ్యారు. రెండో వారంలో మాత్రం ఏకంగా ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. శనివారం జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో లిమినేషన్ లిస్ట్ లో ఉన్న షానీ సాల్మన్ ను హౌస్ నుండి బయటకు పంపించేశారు.
ఇక ఆ మరుసటిరోజు ఆదివారం ఎపిసోడ్ లో అభినయ శ్రీ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఆమె హౌస్ నుండి బయటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. అభినయ శ్రీ 2001 లో తమిళంలో ఫ్రెండ్స్ మూవీలో మొదటగా నటించింది. 2004లో ఆర్య సినిమాలో స్పెషల్ సాంగ్ తో తెలుగు సినిమా ఇండస్ట్రీతో బ్రేక్ వచ్చింది. పలు అవకాశాలు వచ్చి సినిమాల్లో నటించినప్పటికీ సడెన్ గా మధ్యలో కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మళ్లీ బిగ్ బాస్ లో అవకాశంతో తెలుగు ప్రేక్షకులు ఆమెను గుర్తు తెచ్చుకున్నారు.

దీంతో తను ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందు బిగ్ బాస్ హౌస్ మంచి వేదిక అని, ఈ అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకుంటానని అభినయ శ్రీ చెప్పుకొచ్చింది. కానీ హౌస్ లో ఆమెతో పాటు కెరీర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుని బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ గా నిలవాలనే సంకల్పంతో వచ్చిన 20 కంటెస్టెంట్స్ తో పోటీ పడాల్సి వచ్చింది. అందుకోసం రెండు వారాల పాటు బిగ్ బాస్ ఎప్పటిలాగే ఇచ్చిన టాస్క్ లను కూడా ఆడింది.
కానీ, చిన్నపాటి తప్పిదాల కారణంగా ఆమె ఎలిమినేషన్స్ లో ఉండాల్సి వచ్చింది. బిగ్ బాస్ ఇచ్చిన గేమ్స్ లో ఫిజికల్ గా చిన్న పొరపాటు కారణంగా వెనుకబడిపోయింది. తాను గట్టిగానే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. దీనికి తోడు ప్రేక్షకుల ఓటింగ్ ను కూడా ఎలిమినేషన్స్ కి పరిగణలోకి తీసకోవడంతో ఆదివారం ఎపిసోడ్ లో ఆమె హౌస్ నుండి బయటికి రావడం తప్పలేదు. హౌస్ నుండి బయటికి వెళ్తూ ప్రేక్షకులు నన్ను ఇంత త్వరగా ఇంటికి పంపిస్తారనుకోలేదు అంటూ తన అభిప్రాయన్ని వ్యక్తం చేసింది అభినయ.