Bigboss 6 : నిన్న బిగ్‌బాస్ హౌస్ అంతా సందడి వాతావరణం నెలకొంది. చివరలో మాత్రం అంతా ఎమోషనల్ అయ్యారు. మిల్కీ బ్యూటీ తమన్నా రాకతో ఫన్డే సండేకి మరింత జోష్ వచ్చింది. తమన్నా లెటెస్ట్ మూవీ బబ్లీ బౌన్సర్ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లింది. ఆమె చేతికి ఒక కానుక ఇచ్చి ఇంట్లోకి పంపాడు నాగార్జున. ఆ కానుక కేవలం ఇంట్లో ఉన్న మగవాళ్లకు మాత్రమే అని చెప్పడంతో లేడి కంటెస్టెంట్స్ అంతా ‘అన్యాయం సర్.. మీరే అలా చెప్తే ఎలా? లాస్ట్ వీక్ కూడా మగవాళ్లే గెలిచారు’ అని అన్నారు.
అది న్యాయమో అన్యాయమో కాసేపయ్యాక మీకే చెప్తానంటూ.. మగవాళ్లను, ఆడవాళ్లను వేరు వేరు టీమ్‌గా కూర్చోబెట్టాడు నాగ్. తర్వాత తమన్నాని పరిచయం చేశాడు. రకరకాల గేమ్స్‌తో ఆ నలుగురు తమన్నాను ఇప్రెస్ చేయాలని నాగ్ సూచించగా..రేవంత్ పాటతో, సూర్య మిమిక్రీతో ఇంప్రెస్ చేస్తే.. రోహిత్, అర్జున్ తమ మాటలను తమన్నాను పొగిడేశారు. వీరిలో నుంచి రోహిత్, అర్జున్‌లను నాగ్ పక్కకి పెట్టాడు. తర్వాత రేవంత్, సూర్యలో సూర్యకి తన కానుక అందించింది తమన్నా.
ఇంత త్వరగా బయటకు పంపిస్తారనుకోలేదు: అభినయ ఎమోషనల్
ఫైమా, రేవంత్, రాజశేఖర్, మెరీనా-రోహిత్‌లను నాగ్ సేవ్ చేశారు. ఇక చివరగా ఆదిరెడ్డి, అభినయ శ్రీ మిగలగా.. వారిలో అభినయశ్రీ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో హౌస్‌లో అంతా ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ మీదకు వచ్చిన అభినయ.. ‘ఇంత త్వరగా నా ఆడియెన్స్ నన్ను బయటకు పంపిస్తారు’ అని అనుకోలేదని ఎమోషనల్ అయింది. అనంతరం ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇస్తాడు. ఇంట్లో హానెస్ట్‌గా ఉన్న ఐదుగురు, హానెస్ట్‌గా లేని ఐదుగురి పేర్లు చెప్పమని అడిగాడు. హానెస్ట్.. కేటగిరీలో ఫైమా, చంటి, శ్రీ సత్య, బాలాదిత్య, సూర్యల పేర్లను చెప్పి, డిస్ హానెస్ట్ కేటగిరీలో అయితే ఒక్క రేవంత్ పేరు మాత్రమే చెప్పింది. ఆట మధ్యలో పర్సనల్ విషయాలు చెబుతాడు.. అది నాకు నచ్చలేదు.. నువ్ కన్నింగ్‌లా అనిపిస్తున్నావ్ అని ఆయన మొహం మీదే చెప్పాను.. అంటూ అభినయ అంటుంది.