Aadi Purush: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈయన నటించే సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలోఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆది పురుష్. రామాయణం నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా నటి కృతి సనన్ సీత పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు.అయితే ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ ప్రభాస్ ఫాన్స్ సైతం ఈ టీజర్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే కొందరు నెటిజెన్లు టీజర్ పై కామెంట్స్ చేస్తూ పిల్లలు చూసే కార్టూన్ ఛానల్ లాగా ఉంది అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఈ సినిమా VFX ఏమాత్రం బాగా లేదంటూ కామెంట్లు పెడుతున్నారు.మరికొందరైతే ఇది ప్రభాస్ నటించిన సినిమానా లేదంటే కార్టూన్ సినిమానా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఈ టీజర్ పై కామెంట్లు చేస్తున్నారు.
Aadi Purush: అచ్చం రజినీకాంత్ సినిమాని తలపిస్తోంది
ఏది ఏమైనా ఎన్నో అంచనాలు పెట్టుకున్నటువంటి ఈ సినిమా నుంచి ఇలాంటి టీజర్ రావడంతో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ నటించిన
ఆది పురుష్ టీజర్ చూస్తుంటే రజనీకాంత్ నటించిన కొచ్చాడియన్ సినిమా గుర్తుకు వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా గురించి ఇలాంటి కామెంట్లు రావడంతో మేకర్స్ వెంటనే స్పందించి ఈ సినిమా విషయంలో మార్పులు చేస్తారా లేకపోతే ఈ సినిమాని ఇలాగే ప్రేక్షకుల ముందుకు తీసుకు