Twins: సర్వసాధారణంగా కవలపిల్లలు పుట్టడం గురించి వినే ఉంటాము. కొందరు స్వయంగా చూసే ఉంటారు. ఇందులో అనేక రకాల సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. వేరు వేరుగా పుట్టడమే కాకుండా శరీర భాగాలతో కలిసే కవలలుగా పుట్టడం లాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలా పుట్టిన వారిలో కొందరు బ్రతికే ఉన్నారు. మరికొందరు చనిపోయిన ఘటనలు కూడా అనేకసార్లు చోటు చేసుకున్నాయి.
ఒక బిడ్డకు జన్మ ఇవ్వడమంటేనే ఏ స్త్రీకైనా అది గొప్పవరంగానే భావిస్తారు. ఇక ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం అంటే ఓ రకంగా అదృష్టమనే అనే చెప్పవచ్చు. కొన్నిసార్లు ముగ్గురు పిల్లలు పుట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మామూలుగా మహిళలలో విడుదలైన అండం పురుషల నుంచి విడుదలైన శుక్రకణం ఫలదీకరణం చెంది పిండంగా మారుతుంది. కాని పలు సమయాల్లో మహిళలకు నెలకు రెండు అండాలు కూడా విడుదల అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆ సమయంలో శుక్రకణాలతో ఆ రెండు అండాలు ఫలదీకరణం చెందడం వలన కవల పిల్లలు పుడతారు అని వైద్య శాస్త్రం చెబుతోంది.

Twins: ఆ కవల పిల్లలు ఇద్దరికి తల్లి ఒకరే కానీ తండ్రులు మాత్రం ఇద్దరు
అయితే, బ్రెజిల్ లో ఓ అరుదైన ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏముందని అనుకుంటున్నారా..? నిజమే కానీ ఆ కవల పిల్లలు ఇద్దరికి తల్లి ఒకరే అయినా తండ్రులు మాత్రం ఇద్దరు. ఏంటి నమ్మకం కలగడం లేదా…? నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం..! కవల పిల్లలకు జన్మనిచ్చిన యువతి ఓకే రోజు ఇద్దరు యువకులతో శారీరకంగా కలిసిందట. దీంతో ఈ పరిస్థితి నెలకొంది.
ఈ కవల పిల్లలకు డిఎన్ఏ పరీక్షలు చేయడంతో ఈ విషయం బయటపడింది. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా అరుదు. సుమారు 10 లక్షల కేసుల్లో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. శాస్త్రియంగా ఇలాంటి సంఘటనను పేరెంటల్ సూపర్ ఫెకంటడేషన్ అని పిలుస్తారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పుడు చెప్పండి ఇది ఆసక్తికమైన వార్తనే కదా మరి…!