MP Kothapally Geeta : ఆరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బ్యాంకులను మోసం చేసిన కేసులో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆమెకు జైలుశిక్ష పడింది. కొత్తపల్లి గీతకు ఐదేళ్ల శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి 42 కోట్ల రూపాయాల రుణాలను గీద దంపతులు తీసుకున్నారు. అయితే వాటిని మోసపూరితంగా ఎగ్గొట్టారన్న అభియోగం నిరూపితం అయింది. దీంతో కొత్తపల్లి గీతకు జైలుశిక్ష పడింది.
MP Kothapally Geeta :
ఆ తర్వాత 2019లో కొత్తపల్లి గీత బీజేపీలో చేరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో హైదరాబాద్ లో విలువైన ప్రభుత్వ భూములను ఆమె సొంతానికి రాజేసుున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వమే తన భూములను ఆక్రించేందుకు ప్రయత్నిస్తోందంటూ తెలిపారు. అయితే టీఆర్ఎస ప్రభుత్వమే తనను వేధిస్తోందని ఆమె కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగగ్ కు అప్పట్లో ఫిర్యాదు చేశారు.దీంతో అప్పుడు అది వివాదంగా మారింది. కొత్తపల్లి గీతపై అనేక విమర్శలు వచ్చాయి. రాజకీయంగా కూడా ఆమె సమస్యలు ఎదురొన్నారు. వైసీపీని వదిలి టీడీపీకి దగ్గరవ్వడం.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. దీంతో రాజకీయంగా కూడా ఆమె సక్సెస్ అయ్యారు.