Bahubali : తెలుగు సినిమా ఖ్యాతిని నలుదిక్కులకు చాటిన చిత్రం ‘బాహుబలి’. పాన్ ఇండియా మూవీగా దర్శక ధీరుడు రాజమౌళి స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పింది. ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. రికార్డుల మోత మోగిపోయింది. తెలుగు సినిమా రూ.1000 కోట్ల రేసులో సగర్వంగా నిలబడింది. రికార్డుల మోత మోగించిన ఈ చిత్రాన్ని మనం సరిగ్గా చూశామా? అనేది డౌటానుమానం. ఇది ఎందుకు వచ్చింది? మేము 10 సార్లు చూశాం.. నో డౌట్ అంటారా? బాహుబలి 2 చివరిలో రాజమౌళి ఏదో హింట్ ఇచ్చారట అది మనకేల తెలియలేదు?
ఏదైనా సినిమా చూడగానే.. అది ఎన్ని సినిమాల మిక్స్.. ఆ మ్యూజిక్‌ను ఈ పాట నుంచి కాపీ కొట్టారు. ఎక్కడో కంటికి కనిపించని సీన్స్‌లో సైతం లూప్ హోల్స్ వెతికిపట్టి ప్రపంచానికి చాటి చెప్పే నెటిజన్లు.. ఒక విషయాన్ని మాత్రం గుర్తించలేదని.. అనుప్ దాసరి అనే ఓ నెటిజన్ చెబుతున్నాడు. అమెరికాలో లాస్ ఎంజిల్స్‌లో మూవీ మారథాన్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు మన జక్కన్న హాజరయ్యారు. ఆయన సినిమాల్లోంచి కొన్నింటిని సైతం ఇక్కడ ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌లో ఈవెంట్ మేనేజ్‌మేంట్ రాజమౌళితో ‘క్యూ అండ్ ఏ’ సెషన్‌ని నిర్వహించింది. ఈ సెషన్‌లోనే మన జక్కన్న బాహుబలి 3 ఉంటుందని చెప్పారట.
అంతేకాదు.. మీరిది గమనించలేదా? అంటూ ఓ ట్వీట్‌ను కూడా పెట్టాడు. మూవీ మారథాన్ తర్వాత ప్రశ్నోత్తరాల సెషన్‌లో రాజమౌళి మాట్లాడారని చెప్పిన అనుప్.. ఆయన చేసిన సినిమాల్లో ఒక్క సినిమా మాత్రం క్లైమాక్స్‌లో ఓపెన్ ఎండ్‌గా ఓ సంభాషణని పెట్టారని అనుప్ వెల్లడించాడు. అయితే బాహుబలి 2 ఎండ్ క్రెడిట్స్‌లోనే ఇది ఉందని తెలిపాడు. బాహుబలి 2 ఎండింగ్‌లో ఒక చిన్న అమ్మాయి వాయిస్ ఓవర్ ఉందని… అది రాజమౌళి బాహుబలి 3 కోసం ఇచ్చిన హింట్ అని.. దీనిని ఎవరైనా గుర్తించారా? అని తన ట్వీట్‌లో ప్రశ్నించాడు. ఏమీ అర్థం కాక ముక్కున వేలేసుకోవడం నెటిజన్ల వంతైంది. అవునా? ఉందంటారా? ఉండే ఉంటుందిలే.. మరొక్కసారి చూద్దామంటూ.. నెటిజన్లు బాహుబలి 2 ఎండింగ్‌పై ఫోకస్ పెట్టారు.