కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్ నియోజకవర్గాల నుంచి బీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన మరికొంత మంది నేతలను టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి సోమవారం కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు.
పార్టీలో చేరిన వారిలో గోల్కొండ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, వార్డు సభ్యులు, SFI రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆనంద్ తదితరులున్నారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ వ్యతిరేక రాజకీయ శక్తులు రెచ్చిపోతున్నాయని, పేదలు గౌరవంగా జీవించాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వారి మధ్య పనిచేయాలని, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, సర్వేల ఆధారంగానే టిక్కెట్లు ఇస్తామన్నారు.
