బోయపాటి శీను దర్శకత్వంలో ముచ్చటగా మూడవసారి బాలయ్య చేసిన మూవీ అఖండ .వీరి కాంబినేషన్ లో వచ్చిన మొదటి రెండు చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీలో ద్విపాత్రాభినయంలో కనిపించిన బాలయ్య థియేటర్స్ లో అభిమానుల చేత ఈలలు వేస్తున్నారు.ఇప్పటివరకు టాలీవుడ్ లో సత్తా చాటిన బాలయ్య ఇప్పుడు యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా చూపిస్తున్నారు.
ఈ శనివారానికి యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు లక్షల 29 వేల డాలర్స్ ను సాధించిన ఈ మూవీ ప్రస్తుతం రికార్డ్ కలెక్షన్స్ వైపు పరుగులు పెడుతుంది.రిలీజ్ అయిన నాటి నుండి సినీ అభిమానుల మనసు కొల్లగొడుతూ రోజు వార్తలలో నిలుస్తున్న అఖండ బాక్స్ ఆఫీస్ ను డామినేట్ చేస్తూ రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది.